మరోసారి పోలీస్ గా రవితేజ?

Saturday,May 27,2017 - 02:22 by Z_CLU

మాస్ రాజా రవితేజ పోలీస్ గెటప్ అంటే వెంటనే గుర్తొచ్చేది విక్రమార్కుడు సినిమా. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ యాక్టింగ్ ఇరగదీశాడు. తర్వాత మిరపకాయ్, పవర్ సినిమాల్లో కూడా పోలీస్ గా మెప్పించాడు. అలా పోలీస్ గెటప్ వేసిన ప్రతిసారి హిట్ కొట్టిన రవితేజ ఇప్పుడు మరోసారి ఖాకీ చొక్కాలో కనిపించబోతున్నాడనే న్యూస్ వైరల్ అవుతుంది. తాజా రూమర్ ప్రకారం.. ప్రస్తుతం చేస్తున్న టచ్ చేసి చూడు సినిమాలో రవితేజ పోలీసాఫీసర్ గా మెరుపులు మెరిపించబోతున్నాడట.

విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ భారీ షెడ్యూల్ ముగిసింది. నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఆ తర్వాత జూన్ 5 నుంచి మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. 20 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో ఓ యాక్షన్ పార్ట్ తీస్తారు. ఈ సినిమాలో మాస్ రాజా సరసన రాశిఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.