ఈ దసరాకి బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్

Tuesday,June 20,2017 - 07:30 by Z_CLU

దసరా బరిలోకి దూకడానికి రెడీ అవుతున్నారు టాలీవుడ్ దసరా బుల్లోళ్ళు. డిఫెరెంట్ సినిమాలతో సరికొత్త లుక్స్ తో దసరాకు మరిన్ని సంబరాలు మోసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు స్టార్స్.

జై లవకుశ : NTR జై లవకుశ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో NTR ఏకంగా 3 షేడ్స్ లో ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. అల్టిమేట్ ఫ్యామిలీ & యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమాలో నివేద థామస్, రాశిఖన్నా హీరోయిన్స్.

స్పైడర్ : అవుట్ స్టాండింగ్ ఫస్ట్ లుక్స్ తో, అదిరిపోయే టీజర్ తో ఎట్రాక్ట్ చేసిన మహేష్ బాబు స్పైడర్ కూడా దసరా కే రెడీ అవుతుంది. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

పవన్ కళ్యాణ్  – త్రివిక్రమ్ సినిమా : త్రివిక్రమ్ సినిమా అంటేనే హై ఎండ్ ఇమోషన్స్. దానికి తోడు పవన్ కల్యాణ్ లాంటి స్టార్, ఖుష్బూ లాంటి సీనియర్ నటి కూడా ఉండటంతో సినిమాకి యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా కనెక్ట్ అయిపోయారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘అత్తారింటికి దారేది’ కూడా సెప్టెంబర్ 23 న రిలీజై మ్యాగ్జిమం రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఈ సారి కూడా మేకర్స్ ఈ డేట్ పైనే కన్నేశారని టాలీవుడ్ లో టాక్. పవన్ కల్యాణ్ కు ఇది 25వ సినిమా.

బాలకృష్ణ : బాలయ్య కూడా ఈ సినిమాతో ‘పైసా వసూల్’ చేసుకోవడానికి దసరా సీజనే కరెక్ట్ అని ఫిక్సయ్యాడు. మాసివ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలయ్య డాన్ లా కనిపించనున్నాడు.  100 వ సినిమాతో సంక్రాంతికి సంబరాలు మోసుకొచ్చిన బాలయ్య, ఈ సినిమాతో దసరా సంబరాలను డబల్ చేయనున్నాడు.

 

రాజా ది గ్రేట్ : ఇక మాస్ మహారాజ్ రవితేజ రాజా ది గ్రేట్ కూడా దసరా ఫెస్టివల్ కే రెడీ అవుతుంది. బెంగాల్ టైగర్ తరవాత లాంగ్ బ్రేక్ తీసుకున్న రవితేజ, హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య ఈ దసరాకే భారీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతోంది ఈ సినిమా.