విక్రమ్ సిరికొండ ఇంటర్వ్యూ

Friday,January 19,2018 - 04:44 by Z_CLU

రవితేజ ‘టచ్ చేసి చూడు’ టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. యాక్షన్, ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా గురించి డైరెక్టర్ విక్రమ్ సిరికొండ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

అదే మెయిన్ సినిమా… 

లైఫ్ లో బ్యాలన్స్ ఉండాలి అని చెప్పే సినిమా ఇది. ఒక పోలీసాఫీసర్ పర్సనల్ లైఫ్ ని, పోలీస్ ఆఫీసర్ గా ఉండే చాలెంజెస్ ని బ్యాలన్స్ చేసుకునే కథే ‘టచ్ చేసి చూడు’. ప్రొఫెషన్ ఏదైనా ఈ రెండింటిని బ్యాలన్స్ చేసే స్ట్రగులే మా సినిమా…

 

2 ఇంట్రెస్టింగ్ షేడ్స్….

టచ్ చేసి చూడు కంప్లీట్ మూవీ పోలీస్ బ్యాక్ డ్రాప్ లో జరగదు. సినిమా 2 టైమ్ పీరియడ్స్ లో, డిఫెరెంట్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. సగం సినిమాలో రవితేజ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ లా కనిపిస్తాడు. తక్కిన సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపిస్తాడు.

అదే సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్

సినిమాలో టెక్నికల్ ఎలిమెంట్స్ హైలెట్ అవుతాయి. మిగతా పోలీస్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు ఈ సినిమాకు అదే తేడా. టెక్నికల్ ఎలిమెంట్స్ అంటున్నాం కదా అని ఇది సైబర్ క్రైమ్ రిలేటెడ్ కంటెంట్ కాదు. ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి తీసుకునే టెక్నికల్ సపోర్ట్,  కొన్ని ఎలిమెంట్స్ పోలీస్ డిపార్ట్ మెంట్ ని కూడా ఇన్స్ పైర్ చేసేలా ఉంటాయి.

అలా పిలిపించుకోవడం నాకిష్టం లేదు…

నేను రైటర్ ని కాను. నేను వినాయక్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను, మహా అయితే నా ఫ్రెండ్ సర్కిల్ తో స్టోరీ పై పని చేశాను. డాలీ, సురేందర్ రెడ్డి గారితో కూడా ఫ్రెండ్ షిప్ వల్ల చేశాను నా ఫుల్ టైమ్ ఫోకస్ డైరెక్షన్ పైనే…

కథ వక్కంతం వంశీదే కానీ….

సినిమా బేసిక్ స్టోరీ లైన్ వక్కంతం వంశీదే. ముందుగా బుజ్జిగారు ఆ కథ విని ‘ఇంట్రెస్టింగ్ లైన్ ఉంది చేస్తావా’ అన్నారు.. ఆ తరవాత రవితేజ గారు నువ్వు డైరెక్షన్ చేస్తే నాకోకే అన్నారు. అప్పుడు నేను నా సెన్సిబిలిటీస్ ని ఆడ్ చేసుకుని చేస్తాను అని చెప్పాను. అందుకు వాళ్ళు ఓకె అన్నారు. వక్కంతం వంశీ కూడా కో ఆపరేట్ చేయడంతో సినిమా సెట్స్ పైకి వచ్చింది.

టైటిల్ కి జస్టిఫికేషన్ ఉంటుంది…

సినిమాలో హీరో రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అతన్ని టచ్ కూడా చేయలేనంత హీరోయిజం ఉంటుంది. కంప్లీట్ గా సినిమాకు పెట్టిన టైటిల్ కి జస్టిఫికేషన్ ఉంటుంది.

 

హీరోయిన్ క్యారెక్టర్….

రాశిఖన్నా ఈ సినిమాలో డ్యాన్స్ ట్యూటర్ గా కనిపిస్తుంది. సాధారణంగా రవితేజ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ పెద్దగా ఉండదు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ కి మంచి ఫూటేజ్ ఉంటుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. సినిమాలో కొత్త రాశిఖన్నాను చూస్తారు…

అందరూ అలా అనుకుంటున్నారు కానీ…

‘టచ్ చేసి చూడు’ సిన్మా అందరూ అల్ట్రా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనుకుంటున్నారు కానీ అన్ని ఈక్వల్ గా బ్యాలన్స్ చేసిన సినిమా ఇది. లవ్, ఇమోషన్స్, కామెడీ అన్నీ ఉన్న బ్యాలన్స్డ్ గా ఉంటాయి.

సెన్సార్ తరవాతే రిలీజ్ డేట్

22 న సినిమా సెన్సార్ ఉంది. అది క్లియరయ్యాకే మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. మ్యాగ్జిమం ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో రిలీజవుతుంది సినిమా…

ఫ్రెడీ క్యారెక్టర్…

ఫ్రెడీ నెగెటివ్ రోల్ ప్లే చేశాడు. సినిమాను టర్న్ చేసే కీ రోల్ ప్లే చేశాడు సినిమాలో. బిగినింగ్ నుండి విలన్ ఫ్రెష్ లుక్ ఉంటే బెటరనుకున్నాం. ఫ్రెడీ చాలా బాగా చేశాడు సినిమాలో.

ప్రీతమ్ జామ్ 8 మ్యూజిక్….

సినిమాలో కొత్త సౌండ్ ఉండాలి అనుకున్నాము. ప్రీతమ్ జామ్ 8 ప్రస్తుతం బాలీవుడ్ లో నం1 మ్యూజిక్ కంపోజర్. చాలా ఎక్స్ పెన్సివ్ కూడా. ప్రీతమ్ కొంతమంది మ్యూజిక్ కంపోజర్స్ ని హైర్ చేసుకుని సూపర్ వైజ్ చేస్తుంటాడు. వాళ్ళు రెగ్యులర్ గా ట్యూన్స్ కంపోజ్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళను అప్రోచ్ అయిన వాళ్ళు వాటి లోంచి పిక్ చేసుకుంటారు, లేదు నచ్చకపోతే మనకు కావాల్సినట్టుగా కంపోజ్ చేసి ఇస్తారు.

అవే నా స్ట్రెంత్….

లవ్ & ఇమోషన్స్ నా మెయిన్ స్ట్రెంత్. నేను నా ఫస్ట్ మూవీ కోసం ఆల్రెడీ స్టోరీ రాసి పెట్టుకున్నాను. అది వర్కవుట్ అవ్వలేదు. కానీ ఈ స్టోరీ వచ్చింది. ఇక ఆ స్టోరీకి నా మార్క్ లవ్ & ఇమోషన్స్ ని ఆడ్ చేసుకున్నాను. అలా ఇది నా సినిమా అయింది.