"రారండోయ్.." తొలి రోజు వసూళ్లు

Saturday,May 27,2017 - 01:14 by Z_CLU

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ప్రతి ఒక్కరితో హిట్ అనిపించుకుంది. సినిమా బాగుందని అంతా మెచ్చుకుంటున్నారు. అలా మొదటి రోజు మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న రారండోయ్ వేడుక చూద్దాం సినిమా అంతా ఊహించినట్టుగానే తొలిరోజు మంచి వసూళ్లు రాబట్టింది.

నాగచైతన్య కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనర్ గా పేరుతెచ్చుకుంది రారండోయ్ వేడుక చూద్దాం సినిమా. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఏకంగా 3 కోట్ల 40లక్షల రూపాయల షేర్ వచ్చింది. నాగచైతన్య నటించిన రీసెంట్ హిట్ ప్రేమమ్ పాతిక కోట్ల రూపాయల వరకు వసూళ్లు సాధించింది. ఇప్పుడా మార్క్ ను రారండోయ్ వేడుక చూద్దాం సినిమా క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

మొదటి రోజు “రారండోయ్..” షేర్
నైజాం – 1.10 కోట్లు
ఉత్తరాంథ్ర – 44 లక్షలు
ఈస్ట్ – 35 లక్షలు
కృష్ణ – 28 లక్షలు
గుంటూరు – 37 లక్షలు
నెల్లూరు – 11 లక్షలు
వెస్ట్ – 28 లక్షలు
సీడెడ్ – 52 లక్షలు