సంక్రాంతి బరిలో రవితేజ సినిమా

Wednesday,November 22,2017 - 12:26 by Z_CLU

ప్రతిసారి సంక్రాంతి లాగే ఈసారి కూడా బడా బడా సినిమాలతో రెడీ అవుతుంది బాక్సాఫీస్. పవన్ కళ్యాణ్ అజ్ఞాత వాసి, బాలయ్య జై సింహా, విశాల్ అభిమన్యుడు సినిమాలతో పాటు రాజ్ తరుణ్ రాజుగాడు కూడా సంక్రాంతి రిలీజ్ కే ఫిక్సయ్యాడు. అయితే ఇప్పుడు ఈ బరిలోకి రవితేజ కూడా దిగే చాన్సెస్ కనిపిస్తున్నాయి.

బెంగాల్ టైగర్ లాంగ్ తరవాత గ్యాప్ తీసుకుని ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకు వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమాతో బ్యాక్ టు ఫామ్ అనిపించుకున్నాడు. ఈ సినిమా తరవాత ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ‘టచ్ చేసి చూడు’ సినిమా విషయంలోనూ అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నాడు రవితేజ. అయితే ఈ సినిమాను జనవరి 13 న రిలీజ్ చేసే ఆలోచనలో ఫిల్మ్ మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

 

విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన సీరత్ కపూర్ నటిస్తుంది. ప్రీతమ్  చక్రవర్తి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ నిర్మిస్తున్నారు.