రవితేజ ‘టచ్ చేసి చూడు’ మూవీ ఫస్ట్ లుక్

Friday,December 29,2017 - 12:58 by Z_CLU

రవితేజ ‘టచ్ చేసి చూడు’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. రీసెంట్ గా రిలీజైన ‘రాజా ది గ్రేట్’ సినిమాతో బ్యాక్ టు ఫామ్ అనిపించుకున్న మాస్ మహారాజ్ మరో పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రెడీ అవుతున్నాడు. మాసివ్ లుక్ తో యాక్షన్ మోడ్ లో ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ లో సినిమాపై   ఎక్స్ పెక్టేషన్స్ ని రేజ్  చేస్తుంది.

‘కొంచెం ఇష్టం- కొంచెం కష్టం’ తో పాటు ‘రేసుగుర్రం’ లాంటి సెన్సేషనల్ హిట్స్ కి స్క్రీన్ ప్లే అందించిన విక్రమ్  సిరికొండ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. రవితేజ మార్క్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియోని త్వరలో రిలీజ్ చేయనున్న సినిమా యూనిట్, వీలైనంత త్వరలో షూటింగ్ ప్యాకప్ చెప్పే ప్రాసెస్ లో ఉంది.

ఈ సినిమాని నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రవితేజ సరసన రాశిఖన్నా తో పాటు సీరత్ కపూర్ నటిస్తున్న ఈ సినిమాకి ప్రీతమ్ చక్రవర్తి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.