ఫ్యాషన్ డిజైనర్ సెన్సార్ పూర్తి

Saturday,May 27,2017 - 04:12 by Z_CLU

సూపర్ హిట్ లేడీస్ టైలర్ కు సీక్వెల్ గా వస్తోంది ఫ్యాషన్ డిజైనర్ సినిమా. సీనియర్ దర్శకుడు వంశీ తెరకెక్కించిన ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఎందుకంటే ట్రయిలర్ క్లిక్ అవ్వడంతో పాటు మణిశర్మ కంపోజ్ చేసిన సాంగ్స్ హిట్ అవ్వడంతో, ఫ్యాషన్ డిజైనర్ మూవీని చూద్దామని చాలామంది వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డ్ దీనికి A-సర్టిఫికేట్ ఇచ్చింది.

30 ఏళ్ల కిందట విడుదలై సంచలన విజయం సాధించింది లేడీస్ టైలర్ సినిమా. ఆ సినిమాకు సీక్వెల్ తీద్దామని వంశీ దాదాపు ఐదేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు సుమంత్ అశ్విన్ హీరోగా ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ సినిమా మనముందుకు రాబోతోంది. ఈ సినిమా కచ్చితంగా సుమంత్ అశ్విన్ కు స్టార్ డమ్ తెచ్చిపెడుతుందనే అంచనాలున్నాయి. అనీషా ఆంబ్రోస్, మనాలీ రాథోడ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా జూన్ 2న విడుదలకానుంది.