టీజర్ తో రెడీ అవుతున్న రవి తేజ

Saturday,August 12,2017 - 11:30 by Z_CLU

రవితేజ హీరోగా నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం ‘రాజా ది గ్రేట్’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఎక్స్పర్మెంట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నఈ సినిమాలో రవితేజ అంధుడిగా కనిపించబోతున్నాడు. ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ను ఆగస్ట్ 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయబోతున్నారు మేకర్స్.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 30శాతం మినహా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అక్టోబర్ 12న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.