జీ సినిమాలు (12th ఆగష్టు)

Friday,August 11,2017 - 10:04 by Z_CLU

అమరావతి

నటీనటులు : స్నేహ, భూమిక, తారకరత్న, సింధూర గద్దె, రవి బాబు  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

రచన, స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : ఆనంద్ ప్రసాద్

రిలీజ్ డేట్ : 3 డిసెంబర్ 2009

థ్రిల్లర్ సస్పెన్స్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచే దర్శకుడు రవి బాబు తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘అమరావతి’. ఈ చిత్రం లో భూమిక, స్నేహ ల నటన,  సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలు, రవి బాబు టేకింగ్, నందమూరి తారక రత్న క్యారెక్టర్ సినిమాకు హైలైట్స్. ఈ సినిమా కోసం తొలి సారిగా విలన్ అవతారమెత్తిన  తారకరత్న ఈ చిత్రం లో నటనకు గాను నంది అవార్డు అందుకున్నారు. ఆధ్యాంతం  సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలతో ఈ సినిమా అలరిస్తుంది.

=============================================================================

చందమామ

నటీనటులు : నవదీప్, కాజల్ అగర్వాల్, శివ బాలాజీ, సింధు మీనన్

ఇతర నటీనటులు : నాగబాబు, ఉత్తేజ్, ఆహుతి ప్రసాద్, జీవా, అభినయ శ్రీ

మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : C. కళ్యాణ్, S. విజయానంద్

రిలీజ్ డేట్ : 6 సెప్టెంబర్ 2007

కలర్ ఫుల్ డైరెక్టర్ కృష్ణవంశీ నటించిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చందమామ. నవదీప్, శివ బాలాజీలు హీరోలుగా నటించిన ఈ సినిమాలో కాజల్, సింధు మీనన్ హీరోయిన్లుగా నటించారు. సినిమాలో భాగంగా అలరించే కామెడీ హైలెట్ గా నిలుస్తుంది.

===========================================================================

బొమ్మరిల్లు

నటీనటులు : సిద్ధార్థ్, జెనీలియా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, జయసుధ, సత్య కృష్ణన్, సుదీప పింకీ, సురేఖా వాణి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 9 ఆగష్టు 2006

తండ్రి కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బొమ్మరిల్లు. న్యాచురల్ పర్ఫామెన్స్ అలరించిన జెనీలియా, సిద్ధార్థ్ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

==============================================================================

 

యాక్షన్ 3D

నటీనటులు : అల్లరి నరేష్, స్నేహా ఉల్లాల్

ఇతర నటీనటులు : వైభవ్, రాజు సుందరం, శ్యామ్, నీలం ఉపాధ్యాయ్, కామ్న జఠ్మలాని తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : బప్పి& బప్పి లహరి, సన్నీ

డైరెక్టర్ : అనిల్ సుంకర

ప్రొడ్యూసర్ : రామబ్రహ్మం సుంకర

రిలీజ్ డేట్ : 21 జూన్ 2013

అల్లరి నరేష్ నటించిన సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యాక్షన్ 3D’. 2D, 3D ఫార్మాట్లలో తెరకెక్కిన మొట్టమొదటి కామెడీ చిత్రం. అల్లరి నరేష్ కరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి అనిల్ సుంకర దర్శకుడు.

============================================================================

ఆ ఇంట్లో

నటీనటులు : చిన్నా, మయూరి

ఇతర నటీనటులు : వినోద్ కుమార్, దేవన, కోట శ్రీనివాస రావు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : చిన్న

ప్రొడ్యూసర్ : S. శ్రీనివాస రెడ్డి , రాజు చౌదరి

రిలీజ్ డేట్ : 2009

చిన్నా ప్రధాన పాత్రలో నటించిన ఆ ఇంట్లో హారర్ ఎంటర్ టైనర్. తన ఇద్దరు పిల్లలతో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన హీరో అక్కడ ఏం చూశాడు..? అక్కడి పరిస్థితులను ఎదుర్కోవడానికి తాంత్రికుడిని కలుసుకున్న హీరో ఏం తెలుసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.

===========================================================================

అఖిల్

నటీనటులు : అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్

ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సప్తగిరి, హేమ, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్, S.S. తమన్

డైరెక్టర్ : V.V.వినాయక్

ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి, నితిన్

రిలీజ్ డేట్ : నవంబర్ 11, 2015

అక్కినేని అఖిల్ డెబ్యూ ఫిల్మ్ అఖిల్. సాయేషా హీరోయిన్ గా నటించింది. పక్కా రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, రిలీజైన అన్ని థియేటర్ లలోను  సూపర్ హిట్టయింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని వి.వి. వినాయక్ దర్శకత్వం వహించాడు. అఖిల్ ఆఫ్రికాలో జాగ్వార్ తో చేసే ఫైట్ హైలెట్ గా నిలుస్తుంది.

============================================================================

రంగ ది దొంగ

హీరో హీరోయిన్లు – శ్రీకాంత్, విమలా రామన్

ఇతర నటీనటులు – రమ్యకృష్ణ, తెలంగాణ శకుంతల, జీవీ, నాగబాబు

సంగీతం – చక్రి

దర్శకత్వం – జీవీ సుధాకర్ నాయుడు

విడుదల తేదీ – 2010, డిసెంబర్ 30

ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించిన జీవీ… దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా రంగ ది దొంగ. అప్పటికే దర్శకుడిగా మారి నితిన్ తో ఓ సినిమా తీసిన జీవీ… ఈసారి ఓ విభిన్న కథాంశంతో శ్రీకాంత్ ను హీరోగా పెట్టి రంగ ది దొంగ సినిమాను తెరకెక్కించాడు. సినిమాలో  విమలారామన్ పోలీస్ గా కనిపిస్తే… మరో కీలకపాత్రలో రమ్యకృష్ణ నటించింది.  తెరపై భయంకరమైన విలనిజం చూపించిన జీవీ… దర్శకుడిగా మాత్రం ఈ సినిమాలో మంచి కామెడీ పండించాడు. 2010లో విడుదలైన ఈ సినిమాకు చక్రి సంగీతం అందించాడు.