స్టైలిష్ థ్రిల్లర్ గా ఎంటర్టైన్ చేస్తున్న 'లై'

Saturday,August 12,2017 - 12:39 by Z_CLU

యూత్‌స్టార్‌ నితిన్ – హను రాఘవపూడి కాంబినేషన్ లో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ ‘లై’ నిన్న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అర్జున్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ప్రెజెంట్ ఆడియన్స్ ను స్టైలిష్ గా థ్రిల్ చేస్తూ మెస్మరైజ్ చేస్తుంది.

వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన ఈ సినిమా మొదటి రోజే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని బొంబాట్ హిట్ గా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతూ దూసుకెళ్తుంది..

హను రాఘవపూడి ఇంటెలిజెన్స్ స్క్రీన్ ప్లే- స్టైలిష్ మేకింగ్, నితిన్-అర్జున్ మధ్య వచ్చే ఇంట్రెస్టింగ్ సీన్స్, మేఘా ఆకాష్ గ్లామర్, మణి శర్మ సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇలా అన్నీ కలగలిపి ఈ సినిమా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ థియేటర్స్ లో సందడి చేస్తుంది..