రష్మిక మండన్న ఇంటర్వ్యూ

Thursday,August 16,2018 - 03:40 by Z_CLU

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా నటించిన ‘గీతగోవిందం’ సూపర్ హిట్టయింది. సినిమాలో విజయ్ దేవరకొండ పర్ఫామెన్స్ తో పాటు రష్మిక పర్ఫామెన్స్ కి మంచి అప్లాజ్ వస్తుంది. ఈ సందర్భంగా హ్యాప్పీ మోడ్ లో ఉన్న రష్మిక, ఈ సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడింది. అవి మీకోసం…    

ఫస్ట్ డే ఫస్ట్ షో…

నేను సినిమా అంతకుముందు కనీసం  మానిటర్ లో కూడా చూడలేదు. అందుకే ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను… ‘గీతగోవిందం’ లో నేను నటించాను కాబట్టి కాకుండా, ఆడియెన్ లా చూశాను.. చాలా ఎంజాయ్ చేశాను.. నాకు సినిమా చాలా నచ్చేసింది.

కొంచెం కష్టం అనిపించింది…

ఎప్పుడైతే సినిమాలో  నా క్యారెక్టర్ గురించి  క్లారిటీ వచ్చిందో… కొంచెం కష్టం అనిపించింది. ఎందుకంటే తెలుగులో ఇది నాకు సెకండ్ మూవీ. అన్ని డైలాగ్స్, అంత స్ట్రాంగ్ రోల్… చేయగలుగుతానో లేదో అని కొంచెం భయపడ్డాను… అయినా స్టోరీ వినగానే ఓకే చెప్పాను…

అదృష్టంగా ఫీలవుతా….

ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు నమ్మి నాకీ అవకాశం ఇచ్చారు కాబట్టి, నేను వాళ్ళు అనుకున్నట్టు ఆ క్యారెక్టర్ కి న్యాయం చేశాను అని వాళ్ళు అనుకుంటే అదృష్టంగా ఫీలవుతా.

రెండూ డిఫెరెంట్…

‘దేవదాస్’ లో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. నేను ఆ సినిమా చేయడానికి రీజన్ ఉంది. ఇక ‘డియర్ కామ్రేడ్’ విషయానికి వస్తే చాలా స్ట్రాంగ్, స్పోర్ట్స్ బేస్డ్ క్యారెక్టర్. నేనీ సినిమాలో క్రికెటర్ లా కనిపిస్తాను. మేకప్ కూడా ఉండదు.

ఓకె అనడానికి అదే రీజన్…

సినిమాలో చాలా ఫన్ ఉంటుంది. స్టోరీ న్యారేట్ చేసినప్పుడే నాకా విషయం అర్థమైపోయింది. నేను సినిమాని ఓకె చేయడానికి అదే మెయిన్ రీజన్…

చాలా హ్యాప్పీ…

నిజానికి సినిమా పోస్టర్ పై హీరో కి సమానంగా నా పేరు కూడా ఉండటం చాలా హ్యాప్పీ గా అనిపించింది. ఎందుకంటే ఏ హీరోయిన్ అయినా హీరోతో ఈక్వల్ గా, డెడికేటెడ్ గా సినిమా కోసం పని చేస్తారు. కానీ అంతగా వాళ్లకు ఇంపార్టెన్స్ ఇవ్వరు. నా ప్రీవియస్ సినిమాల్లో కూడా పోస్టర్స్ పై ఎక్కడా నా పేరు మెన్షన్ చేయలేదు. ఈ సినిమా కోసం నా పేరు మెన్షన్ చేయడం చాలా హ్యాప్పీగా ఉంది.

నాకైతే ఏమీ అర్థం కావడం లేదు…

ఈ సినిమా కోసం 1 ఇయర్  గా పని చేస్తూనే ఉన్నాం. నిజం చెప్పాలంటే ఇంకా అదే వర్క్ మోడ్ లోనే ఉన్నాం. సడెన్ గా నిన్న సినిమా రిలీజ్ అవ్వగానే సినిమా బావుందని అప్రీసియేషన్స్ బిగిన్ అయ్యాయి.. ప్రస్తుతం నాకేమీ అర్థం కావడం లేదు…

కోపంగా ఉన్నా…

మామూలుగా నాకు కోపం రాదు. అసలు నాకు ఎవరిపై కోపం రాదు. కానీ ఈ సినిమాకోసం 7 నెలలు కోపంగానే ఉన్నా… సినిమాలో లాస్ట్ పోర్షన్ కోసం కొంచెం అక్కడక్కడా నవ్వుతూ కనిపిస్తా అంతే.  కోపంగా ఉండటం కొంచెం కొత్తగా అనిపించింది.

మెచ్చుకోవడం బావుంది…

సినిమా చూశాక అందరూ నా పర్ఫామెన్స్ ని మెచ్చుకోవడం చాలా హ్యాప్పీగా ఉంది…

కంపల్సరీగా అడుగుతా…

ఏ సినిమా అయినా సంతకం చేసే ముందు నా ఫ్యామిలీ మెంబర్స్ ని అడుగుతా.. ఇక కొన్ని పర్టికులర్ సినిమాలు, నాకు చాలా నచ్చేసి, వాళ్ళు కొంచెం అబ్జెక్ట్ చేసినా, రిక్వెస్ట్ చేసి ఒప్పించుకుంటా.. పరశురామ్ గారు ఈ స్టోరీని మా ఇంట్లో వాళ్లకు కూడా చెప్పారు.

ఇక నుండి నన్ను చూస్తారు…

ఇప్పటి వరకు నేను కొత్త కాబట్టి, జస్ట్ డైరెక్టర్స్ ఎలా చెప్తే అలాగే పర్ఫామ్ చేశాను. నా స్టైల్ అంటూ ప్రెజెంట్ చేయలేదు. ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్, ఎక్స్ పీరియన్స్ వచ్చాయి కాబట్టి, నా నెక్స్ట్ సినిమాల్లో రియల్ రష్మికను చూస్తారు.

రూమర్స్..? డోంట్ కేర్…

నేను నా విషయంలో వస్తున్న రూమర్స్ ని అసలు పట్టించుకోను. పర్టికులర్  గా  సోషల్ మీడియాలో.. ఒక సెకన్ లో వాళ్ళ మైండ్ లో వచ్చిన ఆలోచనని పోస్ట్ చేసేసి, నెక్స్ట్ మూమెంట్ లో మర్చిపోతారు. అలాంటి వాళ్ళను మనం పట్టించుకుని ఫీలవ్వడం వేస్ట్… అందుకే నేను పట్టించుకోను..

అక్కడ కూడా… ఇక్కడ కూడా…

తెలుగులో కన్నా, నన్ను ముందుగా గుర్తించింది కన్నడ సినిమా. వాళ్లకు నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. తెలుగు ఆడియెన్స్ నన్నింకా గుర్తించాల్సి ఉంది. అయినా సినిమా విషయంలో స్క్రిప్ట్ నచ్చాలి కానీ, ఏ లాంగ్వేజ్ అయినా చేసేస్తా…