నాని కొత్త సినిమాలో హీరోయిన్ ఫిక్సయింది

Thursday,August 16,2018 - 04:21 by Z_CLU

నాని కొత్త సినిమా ‘జెర్సీ’ హీరోయిన్ ఫిక్సయింది. ప్రస్తుతం ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నాని సరసన నటించేందుకు అనూ ఇమ్మాన్యువెల్ కజిన్ రేబా మోనికా జాన్ ను ఫిక్స్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

అనూ ఇమ్మన్యువెల్ తో పాటే సినిమా కరియర్ ని బిగిన్ చేసింది రేబా మోనికా. ఇప్పటికే తమిళ, మళయాళ సినిమాల్లో నటిస్తున్న రేబా, ఇప్పుడు ‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ కానుంది. నాని ‘మజ్ను’ తో  అనూ ఇమ్మాన్యువెల్ ఇంట్రడ్యూస్ అయితే, ఇప్పుడు రేబా కూడా నాని సినిమాతోనే  తెలుగు సినిమాలో ఎంట్రీ ఇవ్వనుంది.

1986 – 1996 బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ బేస్డ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని 2 డిఫెరెంట్ రోల్స్ లో కనిపించనున్నాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. మ్యాగ్జిమం సెప్టెంబర్ కల్లా ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకు రావాలనే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.