కౌంట్ డౌన్: ‘గీతగోవిందం’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

Saturday,November 03,2018 - 05:01 by Z_CLU

విజయ్ దేవరకొండ కరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ  ‘గీతగోవిందం’. రీసెంట్ గా రిలీజై  టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా, దీపావళి కానుకగా నవంబర్ 4, ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి ‘జీ తెలుగు’లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలీకాస్ట్ కానుంది. అంతేకాదు ఈ సినిమాను చూస్తూ  వినోదంతో పాటు, మరెన్నో ఎగ్జైటింగ్ గిఫ్ట్స్ కూడా గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది జీ తెలుగు.

‘గీతగోవిందం’ టెలికాస్ట్ అయ్యే సమయంలో ఈ సినిమా గురించి 5 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పినవారికి అద్భుతమైన బహుమతులు అందించనుంది జీ తెలుగు.

సినిమా టెలికాస్ట్ టైమ్ లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన వారి వివరాలు ప్రతీ 3 నిమిషాలకు ప్రకటిస్తారు. వారిలోంచి లక్కీ విజేతల్ని ఎంపికచేసి వాళ్లకు ఖరీదైన బహుమతులు అందించనుంది జీ తెలుగు.

ఈ దీపావళికి ఎంటర్టైన్ మెంట్ తో పాటు ఖరీదైన బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని ఏ మాత్రం మిస్ అవ్వకండి. నవంబర్ 4న సాయంత్రం 5 నుంచి మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డీ ఛానెల్స్ లో బ్లాక్ బస్టర్ గీతగోవిందం సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.