‘గీతగోవిందం’ టీమ్ ని మెచ్చుకున్న ప్రముఖులు

Thursday,August 16,2018 - 01:18 by Z_CLU

నిన్న రిలీజైన ‘గీతగోవిందం’  సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రిలీజ్ కి ముందే అటు యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ లో భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా, అవుట్ అండ్ అవుట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుంది. అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ హిట్ తో ఫ్యాన్స్ కి మరింత క్లోజ్ అయిన విజయ్ దేవరకొండ, ‘గీతగోవిందం’ తో తనలోని మరో ఆంగిల్ ని ప్రెజెంట్ చేశాడు. అందుకే మెగాస్టార్ చిరంజీవి చేత కూడా శభాష్ అనిపించుకున్నాడు.

నిన్న ‘గీతగోవిందం’ సినిమా చూసిన చిరు, సినిమా టీమ్ ని పిలిచి మరీ అప్రీషియేట్ చేశాడు. విజయ్ దేవరకొండ ఇన్నోసెంట్ లుక్స్, రష్మిక మండన్న పర్ఫామెన్స్, వెన్నెల కిషోర్ హిలేరియస్ ప్రెజెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలోని  ప్రతి ఎలిమెంట్, ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుంది. అందుకే ఈ సినిమాకి టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు దక్కుతున్నాయి.

 

https://twitter.com/AnilRavipudi/status/1029975774307045376