ఏడాది పూర్తి చేసుకున్న బ్లాక్ బస్టర్ గీతగోవిందం

Friday,August 16,2019 - 02:29 by Z_CLU

మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ పతకం పై సక్సెసఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన సినిమా “గీత గోవిందం”. టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ఈ సినిమా లో హ్యాపెనింగ్ హీరో, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక… గోవింద్, గీత పాత్రల్లో ఒదిగిపోయారు. అలానే గోపీసుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు మరొక అసెట్. గతేడాది ఆగష్టు 15న విడుదలై 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా నిన్నటితో ఏడాది పూర్తిచేసుకుంది.

పరుశరామ్ డైరెక్షన్ స్కిల్స్
అటు యూత్, ఇటు ఫ్యామిలీస్ కి నచ్చేలా సినిమాను తెరకెక్కించాడు. థియేటర్ కి వెళ్లి హాయిగా సినిమా చూసి నవ్వుకొని, ఎంజాయ్ చేసి వచ్చేలా గీతగోవిందం సినిమాను మలిచాడు. కథ ఎక్కడా గాడి తప్పకుండా అందులోనే కమర్షియల్ అంశాలు జోడించి, గీతగోవిందంను బ్లాక్ బస్టర్ సినిమాగా మార్చి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు పరుశురాం.

గీతా ఆర్ట్స్ ప్రొడక్ట్
గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి ఏ సినిమా వచ్చినా, అది ఓ రేంజ్ సక్సెస్ ఇస్తుందనే నమ్మకాన్ని గీతగోవిందం మరోసారి రుజువు చేసింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి నిర్మాణ సారథ్యంలో, బన్నీ వాసు నిర్మాతగా వచ్చిన ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడంలో గీతా ఆర్ట్స్ సినిమా అనే బ్రాండ్ గీతగోవిందంపై ఉండటమే ముఖ్య కారణం.

విజయ్ దేవరకొండను ఫామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమా
అర్జున్ రెడ్డి తరువాత వస్తున్న సినిమా కావడంతో గీత గోవిందం పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఐతే అర్జున్ రెడ్డిని ఎక్కువుగా యూత్ ఫాలో అయ్యారు. కానీ గీతా గోవిందంతో అటు యూత్ ని ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఒకేసారి సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. అంతేకాదు, కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను కూడా అందుకున్నాడు. అలానే ఈ సినిమా లో గీతగా నటించిన రష్మిక కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

మరుపురాని గీతం ఇంకేం ఇంకేం కావాలె
ఈ దశాబ్దపు మరుపురాని గీతాల్లో గీతగోవిందం మ్యూజిక్ ఆల్బమ్ లోని “ఇంకేం ఇంకేం కావాలె” పాట టాప్-3 పొజిషన్ లో ఉండటం ఖాయం. ఈ పాట నుంచే గీతగోవిందం సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పటి వరకు ఈ పాటకు దాదాపు 355 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఈ పాటని ప్రేకక్షులు ఏ రేంజ్ లో విన్నారో అర్ధం చేసుకోవచ్చు. మొత్తంగా గీతగోవిందం రికార్డ్స్ బ్రేక్ చేసి ఏడాది పూర్తయింది.