Interview హీరోయిన్ రష్మిక మందన్న (పుష్ప1)

Monday,December 13,2021 - 05:11 by Z_CLU

‘ఛలో’ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకెళ్తుంది. మరికొన్ని రోజుల్లో శ్రీవల్లిగా ‘పుష్ప1‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రష్మిక తాజాగా మీడియాతో ఆ సినిమా కబుర్లు చెప్పుకుంది. ఆ విశేషాలు రష్మిక మాటల్లోనే…

కథ , క్యారెక్టర్ తెలియకుండానే

‘పుష్ప’ సినిమాకు సంబంధించి కథ , క్యారెక్టర్ పెద్దగా తెలియకుండానే సైన్ చేశాను. క్యారెక్టర్ గురించి కూడా పైపైన ఇలా ఉంటుంది అన్నట్టుగా చెప్పారు అంతే. లుక్ టెస్ట్ వరకూ ఆ క్యారెక్టర్ అలా ఉంటుందని తెలియలేదు. ఈ సినిమాతో ఎలాగైనా సుకుమార్ గారి వరల్డ్ లో ఓ క్యారెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. అందుకే కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నాను.

pushpa movie rashmika (1)

లుక్ టెస్టులు చాలా

క్యారెక్టర్ ఎలా ఉండాలో ఒక డిజైన్ చేసి లుక్ టెస్ట్ చేశారు. అది అంతగా సెట్ అవ్వలేదని మళ్ళీ చేశారు. అలా కొన్ని లుక్ టెస్ట్ ల తర్వాత ఫైనల్ గా ఒక లుక్ లాక్ చేశారు. శ్రీవల్లి క్యారెక్టర్ విషయంలో సుకుమార్ గారు చాలా కేర్ తీసుకున్నారు. సినిమాలో ప్రతీ క్యారెక్టర్ లుక్ కొత్తగా ఇప్పటి వరకూ చూడని విధంగా ఉంటుంది. ముఖ్యంగా నా క్యారెక్టర్ చిత్తూరు యాసలో మాట్లాడుతుంది. సినిమా ఒకే చేయగానే చిత్తూరు నేర్చుకోవాలి అన్నారు. వెంటనే ఆ యాస నేర్చుకోవడానికి సాధన చేశాను. నాకు అను అనే అమ్మాయితో పాటు అసిస్టెంట్ డైరెక్టర్స్ హెల్ప్ చేశారు.

బన్నీ గారు…కొత్త పేరుతో

గీత గోవిందం టైంలో బన్నీ గారితో కలిసి వర్క్ చేయాలనుకున్నాను. ఇంత త్వరగా కుదురుతుందని అనుకోలేదు. బన్నీ గారితో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ చాలా మంచి అనుభూతి కలిగించింది. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. సినిమాలో మా లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది. ఊరందరికీ పుష్ప రాజ్ అయితే నా దగ్గరికి వచ్చే సరికి పుష్ప మాత్రమే. మా సీన్స్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక సెట్ లో బన్నీ గారు క్రష్మిక అంటూ పిలిచి వారు. నిన్న ఈవెంట్ లో కూడా ఆ విషయం చెప్పి నాకు కొత్త పేరు పెట్టారు.

‘పుష్ప’  అలా ఉంటుంది

పుష్ప సినిమా అంతా అత్యంత సహజంగా ఉంటుంది. అందుకే సినిమా చూసే టప్పుడు క్యారెక్టర్స్ తో  ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు. సన్నివేశాలు నేచురల్ గా ఉండటం వలన సినిమా ప్రేక్షకుల్లోకి మరింత దగ్గరవుతుందని నమ్ముతున్నాను.

pushpa-movie-allu-arjun-rashmika2

ఆ సాంగ్ కి ఇబ్బంది పడ్డా

సినిమాలో నేను బాగా ఇబ్బంది పడి నటించింది “సామి ..సామి” పాటలో మాత్రమే. ఆ సాంగ్ కోరియోగ్రఫీ చాలా కొత్తగా ఉంటుంది. అందువల్ల ఆ సాంగ్ కోసం కష్టపడాల్సి వచ్చింది. కానీ ఆ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్స్ లో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు.

samantha pushpa

సమంత నిజంగా గ్రేట్ 

సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ లో బాగా డాన్స్ చేసింది. ఆ సాంగ్ రిలీజ్ అవ్వగానే తనకి “Ur Looking good in the song” అని ఒక మెసేజ్ పెట్టాను. ఒక సూపర్ స్టార్ అయి ఉండి ఒక సినిమాలో జస్ట్ స్పెషల్ సాంగ్ చేయాలంటే అందరూ చేయలేరు. నేను కూడా ఆలోచిస్తాను. కానీ సమంత ఆ విషయంలో చాలా గ్రేట్. హీరోయిన్ గా లేడీ ఓరియంటెడ్ సినిమాలు పెద్ద సినిమాలు చూస్తూ కూడా స్పెషల్ సాంగ్ చేయడం నిజంగా గొప్ప విషయం.

బిగ్ బీ గారితో గొప్ప అనుభూతి

హిందీలో రెండు సినిమాలు చేస్తున్నాను. అందులో ఒకటి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గారితో చేస్తున్న ‘గుడ్ బై’ ఒకటి కాగా మరొకటి ‘మిషన్ మజ్ను’. గుడ్ బై షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది.  బిగ్ బీ గారితో నటించడం చాలా సంతోషాన్నిచ్చింది. షూటింగ్ లో ఆయన చాలా కూల్ గా ఒక చిన్న పిల్లాడిలా అందరితో సరదాగా ఉంటారు. అందు వల్ల చాలా కంఫర్ట్ అనిపించింది. షూట్ తర్వాత అమ్మో బచ్చన్ సార్ అనిపించేది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. ‘మిషన్ మజ్ను’ కి సంబంధించి షూటింగ్ పూర్తయింది. త్వరలోనే రిలీజ్ అవ్వనుంది.

తెలుగులోనే నెక్స్ట్ అవే

తెలుగులో శర్వానంద్ తో కలిసి ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ అనే సినిమా చేస్తున్నాను. అలాగే తెలుగులో ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి. త్వరలోనే వాటి డీటెయిల్స్ చెప్తాను. హిందీ లో రెండు సినిమాలు చేస్తున్నాను. అలాగే పుష్ప 2 చేయాల్సి ఉంది. అదెప్పుడు అనేది ఇంకా తెలియదు.

– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics