రష్మిక ఇంటర్వ్యూ

Monday,January 06,2020 - 06:05 by Z_CLU

‘సరిలేరు నీకెవ్వరు’ లో మహేష్ బాబు సరసన నటించింది రష్మిక మండన్న. ఈ సినిమాలో కామిక్ డోస్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనుంది. అందునా సినిమా మొత్తం హీరో వెంటపడే అమ్మాయిలా కాకుండా, తన క్యారెక్టర్ కి ప్రాపర్ క్లోజర్ కూడా ఉంటుంది అని చెప్పుకున్న రష్మిక, ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు చెప్పుకుంది అవి మీకోసం… 

నా క్యారెక్టర్… 

సినిమాలో హీరోని చాలా విసిగిస్తుంటా… నా క్యారెక్టర్ చాలా కామిక్ గా ఉంటుంది. మీరు ట్రైలర్ లో చూసినట్టు క్యారెక్టర్ కి పర్టికులర్ మేనరిజం ఉంటుంది. నేను రియల్ లైఫ్ లో కూడా అంతే… నా చుట్టూ ఉన్నవాళ్ళను ఏదోలా టార్చర్ పెడుతుందా.. అది నా స్కిల్.

ఇది కొత్తగా ఉంది… 

‘డియర్ కామ్రేడ్’ లో నేను చేసింది సీరియస్ రోల్. కానీ ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా కామెడీ చేస్తుంది. చాలెంజింగ్ గా తీసుకుని చేశాను. ఈ ప్రయోగం చేయాల్సిందే అనిపించింది.. అందుకే చేశాను.

నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్… 

సినిమాలో నా క్యారెక్టర్ కూడా నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ లా ఉంటుంది. సినిమాలో నేనేం చేసినా అది అనిల్ రావిపూడి గారు చేసి చూపించిందే.

విజయశాంతి గారు…

నేను విజయశాంతి గారి గురించి విని ఉన్నాను. అంత సీనియర్ నటి అనగానే న్యాచురల్ గానే నాకు కాస్త జంకు ఉంటుంది. మొదట్లో కాస్త తక్కువగానే మాట్లాడినా తరవాత చాలా క్లోజ్ అయ్యాను. సెట్ లో చాలా విషయాలు మాట్లాడుకునే వాళ్ళం.

ఒక సాలిడ్ రీజన్…

సినిమాలో నా క్యారెక్టర్ కి ఒక సాలిడ్ రీజన్ ఉంటుంది. జనరల్ గా సూపర్ స్టార్ సినిమాలో హీరోయిన్ కి చేయడానికి ఏమీ ఉండదు అంటారు.. కానీ నా క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ క్లోజర్ ఉంది. అందుకే నేను చాలా హ్యాప్పీ.

క్యారెక్టర్ ఫస్ట్.. మిగతావి బోనస్… 

అనిల్ గారు నాకు కథ చెప్పినప్పుడు నా క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందనేది కూడా చేసి చూపించారు. ఇప్పటి వరకు నా కరియర్ లో నేనిలాంటి క్యారెక్టర్ చేయలేదు.అందుకే ఎగ్జైటెడ్ గా ఓకె చెప్పేశా… ఇక దానికి తోడు మహేష్ బాబుగారు, విజయశాంతి గారు అడిషనల్ బోనస్…

ట్రైన్ ఎపిసోడ్ గురించి… 

సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ దాదాపు 20 రోజులు షూట్ చేశాం. షూటింగ్ చేసినన్ని రోజులు నవ్వుకుంటూనే ఉన్నాం. తరవాత డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అంతే నవ్వుకున్నాం.

కొత్త రష్మిక…

సినిమా రిలీజ్ తరవాత మైండ్ బ్లాక్ సాంగ్ లో నా పర్ఫామెన్స్ కి ఆడియెన్స్ రియాక్షన్ ఎలా ఉండబోతుందన్నది చూడాలి. అసలు ఆ సాంగ్ లో డ్యాన్స్ చేసింది నేను కాదేమో అనిపిస్తుంది నాకైతే నేనిప్పటి వరకు అలాంటి పర్ఫామెన్స్ ఇవ్వలేదు… కొత్త రష్మికను చూస్తారు.

ఈ ఏడాది బిగినింగ్ నాదే…

ఇప్పుడు ‘సరిలేరు..’ వచ్చేనెల ‘భీష్మ’ రిలీజవుతుంది. ఈ ఏడాది బిగినింగ్ నాదే.. చాలా హ్యాప్పీగా ఉంది.

ముందే తెలుసు… 

‘హీ ఈజ్ సో క్యూట్…’ సాంగ్ టిక్ టాక్ లో చాలా వైరల్ అయింది. అందుకే చాలా సింపుల్ స్టెప్స్ ని చాలా ఎక్స్ ప్రేసివ్ గా ప్లాన్ చేశారు. కానీ ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు.

మైండ్ బ్లాక్ కి ముందు…

మైండ్ బ్లాక్ సాంగ్ కి ముందు నేనసలు డ్యాన్స్ చేయగలనా లేదో కూడా ఎవరికీ తెలీదు… కానీ ఎప్పుడైతే నేను సెట్స్ పైకి వెళ్లి పర్ఫామ్ చేశానో అందరూ షాక్ అయ్యారు. సిచ్యువేషన్ వస్తే అంతే.. నేనేదైనా చేసేస్తా…