రేపట్నుంచి రంగస్థలం కొత్త షెడ్యూల్

Tuesday,January 02,2018 - 11:03 by Z_CLU

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రంగస్థలం సినిమాకు సంబంధించి రేపట్నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభంకాబోతోంది. ఈనెల 12వ తేదీ వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. హైదరాబాద్ లో వేసిన సెట్ లోనే ఈ నయా షెడ్యూల్ మొదలుకానుంది.

ఈ షెడ్యూల్ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని ఫైనల్ షెడ్యూల్ ప్రారంభిస్తారు. ఈ ఫైనల్ షెడ్యూల్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రారంభమౌతుంది. ఈ షెడ్యూల్ తో టోటల్ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది.

రంగస్థలం సినిమాకు సంబంధించి ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్ వర్క్ నడుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను మార్చి 30న విడుదల చేయబోతున్నారు.