రేపే రంగస్థలం ఫస్ట్ లుక్

Thursday,December 07,2017 - 11:10 by Z_CLU

రామ్ చరణ్, సుకుమార్ ఫ్రెష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ రంగస్థలం. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రేపు (డిసెంబర్ 8) విడుదల చేయబోతున్నారు. రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటల 30 నిమిషాలకు రంగస్థలం ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది.

ఫస్ట్ లుక్ లో భాగంగా సినిమాకు సంబంధించి ఓ బ్రాండ్ న్యూ ఫొటోను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో చరణ్ లుక్ ఎలా ఉండబోతోందనే విషయంపై ఇప్పటికే అందరికీ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీకి కొనసాగింపుగా, మరింత ఎట్రాక్టివ్ గా ఓ లుక్ రాబోతోంది. దీంతో పాటు రంగస్థలం తెలుగు టైటిల్ లోగో కూడా వచ్చే అవకాశముంది.

రంగస్థలం సినిమాలో చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. అనసూయ, ఆది పినిశెట్టి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.