షూటింగ్ పూర్తిచేసుకున్న రంగస్థలం

Monday,March 05,2018 - 12:23 by Z_CLU

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ రంగస్థలం. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దాదాపు ఏడాదిగా షూటింగ్ జరుపుకున్న రంగస్థలం సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. సారథి స్టుడియోస్, బూత్ బంగ్లా వద్ద షూట్ చేసిన కొంత ప్యాచ్ వర్క్ తో ఈ సినిమా టోటల్ షూట్ కంప్లీట్ అయింది.

రంగస్థలంలో రామ్ చరణ్ డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. చిట్టిబాబు అనే పాత్రలో చెవిటివాడిగా నటిస్తున్నాడు. చరణ్ లుక్, అతడి క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ ఇప్పటికే టీజర్ వచ్చింది. ఇక సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత లుక్ ను కూడా మరో టీజర్ ద్వారా రివీల్ చేశారు. రామలక్ష్మి పాత్రలో పల్లెటూరి పిల్లగా సమంత నేచురల్ గా ఉంది.

హీరోహీరోయిన్ల లుక్స్ తో పాటు త్వరలోనే మరింతమంది నటీనటుల లుక్స్, క్యారెక్టర్లను రివీల్ చేయబోతున్నారు. 1980ల నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా పల్లెటూరి సెట్ వేశారు.

మార్చి 18న రంగస్థలం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను వైజాగ్ లో సెలబ్రేట్ చేయబోతున్నారు. ఇక మూవీని మార్చి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.