“నా పేరు సూర్య” ఫస్ట్ ఇంపాక్ట్ కి ప్రశంసల జ‌ల్లు

Tuesday,January 02,2018 - 10:51 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యూయేల్ జంట‌గా వ‌క్కంతం వంశి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ , శ‌ర‌త్ కుమార్ లు ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.

ఈ చిత్రానికి సంబందించిన ఫ‌స్ట్ ఇంపాక్ట్ జ‌న‌వ‌రి 1న విడ‌ుదల చేశారు. ఈ టీజ‌ర్ చూసిన వారంతా అల్లు అర్జున్ డెడికేష‌న్ గురించి, మేకోవ‌ర్ గురించి మాట్లాడుకుంటున్నారు. నీకు సూర్య సోల్జ‌ర్‌.. కాని ప్ర‌పంచానికి సూర్య అంటే యాంగర్‌….. అనే ఇంట్రో తో స్టార్ట‌యిన ఈ ఇంపాక్ట్ నిజంగానే అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు ఇంపాక్ట్ క‌లిగించింది.

ఏ ముహుర్తాన మెట్ట‌మెద‌టి సారిగా ఫ‌స్ట్ ఇంపాక్ట్ అన్నారో గాని ఈ విజువ‌ల్స్ అంత‌లా ఇంపాక్ట్ క‌లిగించాయి. ఈ ఇంపాక్ట్ చూస్తే అల్లు అర్జున్ డెడికేష‌న్ , ద‌ర్శ‌కుడు ప‌నితీరు, కెమెరామెన్ విజువ‌ల్స్ తో పాటు డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. చ‌చ్చిపోతాను కాని ఇక్క‌డ కాదు బోర్డ‌ర్ లో చ‌చ్చిపోతాను అనే డైలాగ్ రోమాలు నిక్క‌బోడుచుకునేలా వుందంటున్నారు.

అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ – శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు.