బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీకి రెడీ అవుతున్న ప్రభాస్

Tuesday,January 02,2018 - 12:32 by Z_CLU

ప్రస్తుతం ‘సాహో’ సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు ప్రభాస్. ప్రస్తుతం జనవరి 5 నుండి అబూదాబి లో జరగనున్న నెల రోజుల రెగ్యులర్ షూటింగ్ కోసం ప్రిపరేషన్స్ లో ఉన్నాడు. ఈ షెడ్యూల్ లో తెరకెక్కనున్న యాక్షన్ సీక్వెన్సెస్ కోసం లాస్ ఏంజిల్స్ లో స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ప్రభాస్. అయితే బాహుబలి సక్సెస్ తరవాత యూనివర్సల్ స్టార్ అనిపించుకున్న ప్రభాస్, ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.

కరణ్ జోహర్ నిర్మించనున్న సినిమాతో బాలీవుడ్ లో లాంచ్ కానున్న ప్రభాస్, ఈ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించనున్నాడు. ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నా, ఇప్పుడీ న్యూస్ అఫీషియల్ గా బయటికి రావడంతో సంబరాలు చేసుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.