NTR బయోపిక్ నుండి రానా ఫస్ట్ లుక్ పోస్టర్

Friday,December 14,2018 - 11:03 by Z_CLU

ఈ రోజు తన 34 వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు రానా. ఈ సందర్భంగా NTR బయోపిక్ లోని రానా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. పర్ఫెక్ట్ మేకోవర్ తో కంప్లీట్ గా చంద్రబాబు నాయుడులా  ఉన్న రానా లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కర్షన్ పాయింట్ లా మారాయి.

NTR బయోపిక్ లోని ఫస్ట్ పార్ట్ ‘కథానాయకుడు’ ఇంట్రెస్టింగ్ ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో మెస్మరైజ్ చేస్తే, ‘మహా నాయకుడు’ లో NTR జీవితంలోని పొలిటికల్ ఎలిమెంట్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. మహా నటుడిగా అవుట్ స్టాండింగ్ స్టార్ డమ్ ఉన్న వ్యక్తి, పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ గా, ముఖ్యమంత్రిగా ట్రాన్స్ ఫామ్ అయిన తీరు, సినిమాలో మోస్ట్ మెస్మరైజింగ్ ఎలిమెంట్స్ కానున్నాయి. ఈ ఎపిసోడ్స్ లో కీ స్పేస్ లో కనిపించనున్నాడు రానా.

ఇప్పటి వరకు సినిమాలోని స్టిల్స్, ఫస్ట్ లుక్స్ తో సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేసిన మేకర్స్, ఈ నెల 16 న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఈ ఈవెంట్ తర్వాత డిసెంబర్ 21 న NTR స్వస్థలం నిమ్మకూరులో గ్రాండ్ గా ఆడియో లాంచ్ చేస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ కంపోజర్.