'ఎన్టీఆర్ మహానాయకుడు' షూటింగ్ అప్ డేట్స్

Wednesday,February 06,2019 - 11:39 by Z_CLU

‘ఎన్టీఆర్ మహానాయకుడు’ కి సంబంధించి బ్యాలెన్స్ షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో నిమగ్నమయ్యారు యూనిట్… ఇప్పటికే బాలకృష్ణ పై స్టేడియంలో స్పీచ్  సన్నివేశాలు ,  చైతన్య రథం సన్నివేశాలను  ఫినిష్ చేసుకున్న మేకర్స్  ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో  కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

ఆర్.ఎఫ్.సిటీ లో వేసిన సెట్ లో బసవతారకం పాత్రపై ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. యవ్వనంలో బసవతారకం  పాత్రలో గ్రీష్మ నటిస్తోంది. ఈ షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పనున్నారు.

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ కంపోజర్. బాలకృష్ణవిష్ణు ఇందూరిసాయి కొర్రపాటి సంయుక్తంగా  నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి నెలాఖరున విడుదల కానుంది.