జనవరి బాక్సాఫీస్ రివ్యూ

Wednesday,January 30,2019 - 03:16 by Z_CLU

న్యూ ఇయర్ సెలెబ్రేషన్ తో పాటే టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కూడా బిగిన్ అయిపోయింది. వరసగా సంక్రాంతి రిలీజ్ కి ఫిక్స్ అయిన సినిమాల ప్రమోషన్స్ హడావిడితో బిగిన్ అయిన జనవరి, మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో ముగిసింది. ఓవరాల్ గా జనవరి సినిమా బాక్సాఫీస్  రివ్యూ…

NTR – కథానాయకుడు: భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా, ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. కాకపోతే ఈ బయోపిక్ 2 భాగాలుగా డివైడ్ అయినందుకు, ఆడియెన్స్ కి క్లైమాక్స్ లేని సినిమా అనే ఫీలింగ్ ని కలిగించింది. ఈ సినిమా ఇంపాక్ట్ NTR – కథానాయకుడు రిలీజ్ తరవాత మరింత ఎలివేట్ అయ్యే అవకాశాలున్నాయి. బాలయ్య రూపంలో మరోసారి NTR ని చూసుకున్నారు తెలుగు ఆడియెన్స్.

పేట : రజినీకాంత్ గత సినిమాల కంప్లీట్ గ్రేస్ ఈ ఒక్క సినిమాలో చూపించేశాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు. రివేంజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని మాస్ ఎలిమెంట్స్ తో ప్రెజెంట్ చేద్దామనుకున్న కార్తీక్ సుబ్బరాజు ప్రయత్నం, సంక్రాంతి బరిలో అంత స్ట్రాంగ్ గా నిలబడలేదనే చెప్పాలి.

వినయ విధేయ రామ : మొత్తానికి రామ్ చరణ్ కూడా బోయపాటి డైరెక్షన్ లో నటించేశాడు అనిపించింది ఈ సినిమా. అంతకు మించి, చెర్రీ కరియర్ లో ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగిందనైతే అస్సలు చెప్పలేం. మరీ ముఖ్యంగా  రామ్ చరణ్ స్టాండర్డ్స్ ని అందుకోవడంలో తటపటాయించిన యాక్షన్ సీక్వెన్సెస్ ఫ్యాన్స్ ని చిన్నగా డిజప్పాయింట్ చేసేశాయి. ఇకపోతే అటు వినయ విధేయతలున్న ఫ్యామిలీ కుర్రాడిలా, మరో వైపు ఉగ్ర రాముడిలా  2 డిఫెరెంట్ షేడ్స్ లో చెర్రీ అవతారాన్ని 100% ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్.

 

F2: సంక్రాతి బరిలో 100 మార్కులతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన సినిమా. ‘అసలు సినిమాలో కథ ఏది…?’ అని అక్కడక్కడా క్వశ్చన్స్ రేజ్ అయినా, సినిమాలో వర్కవుట్ అయిన డబుల్ డోస్ కామెడీ, ఫస్ట్ వీక్ లోనే  F2 ని బ్లాక్ బస్టర్ సినిమాగా డిక్లేర్ అయ్యేలా చేసింది.

మిస్టర్ మజ్ను : అఖిల్ ని మోస్ట్ ప్యాషనేట్ లవర్ లా ప్రెజెంట్ చేసిన సినిమా. రిలీజ్ కి ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ ‘మిస్టర్ మజ్ను’, ఫస్ట్ షో తోనే యూత్ కి ఈజీగా కనెక్ట్ అయిపోయింది. మరీ ముఖ్యంగా అఖిల్ లుక్స్ కి ఫిదా అయిపోయారు ఫ్యాన్స్.