2018 టాప్-10 మూవీస్ లో మహానటి, రంగస్థలం

Friday,December 14,2018 - 11:02 by Z_CLU

ఎప్పట్లానే ఈ ఏడాది కూడా IMDB టాప్-10 మూవీస్ లిస్ట్ లో తెలుగు సినిమాలకు ప్రాధాన్యం దక్కింది. కాకపోతే ఈసారి కౌంట్ తగ్గింది. గతేడాది లిస్ట్ లో ఏకంగా 3 తెలుగు సినిమాలు నిలిస్తే, ఈసారి కేవలం రెండంటే రెండు మాత్రమే లిస్ట్ లో చోటు దక్కించుకున్నాయి.

ఈ ఏడాది IMDB టాప్-10 మూవీస్ లిస్ట్ లో రంగస్థలం, మహానటి సినిమాలు చోటుదక్కించుకున్నాయి. మహానటి 4వ స్థానంలో నిలిస్తే, చిట్టిబాబు 7వ ప్లేస్ లో నిలిచాడు. ప్రతి ఏటా IMDB ప్రకటించే టాప్-10 మూవీస్ లిస్ట్ కు ఓ ప్రత్యేకత ఉంటుంది. సినిమాలకు వీళ్లు రేటింగ్స్ ఇవ్వరు. ఆడియన్స్ రివ్యూ, వాళ్లిచ్చే రేటింగ్స్ ను యావరేజ్ చేసి టాప్-10 లిస్ట్ తయారుచేస్తుంటారు.

అలా గతేడాది లిస్ట్ లో బాహుబలి-2, అర్జున్ రెడ్డి, ఘాజి సినిమాలు చోటు దక్కించుకోగా.. ఈ ఏడాది ఆ అరుదైన అవకాశం మహానటి, రంగస్థలం సినిమాలకు దక్కింది. టాప్-10 లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో అంధాదున్ నిలవగా.. లాస్ట్ లో సంజు సినిమా నిలిచింది.

IMDB టాప్-10 మూవీస్ 2018
1. అంధాధున్ (హిందీ)
2. రాట్ససన్ (తమిళ్)
3. 96 (తమిళ్)
4. మహానటి (తెలుగు)
5. బధాయి హో (హిందీ)
6. ప్యాడ్ మేన్ (హిందీ)
7. రంగస్థలం (తెలుగు)
8. స్త్రీ (హిందీ)
9. రాజి (హిందీ)
10. సంజు (హిందీ)