విజయ్ దేవరకొండ కోలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం

Monday,March 05,2018 - 12:01 by Z_CLU

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కోలీవుడ్ కి ఎంటర్ అవుతున్నాడు. తెలుగు-తమిళ భాషల్లో ఈ హీరో నటించనున్న కొత్త సినిమా కొద్దిసేపటి కిందట రామానాయుడు స్టుడియోస్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమాకు క్లాప్ కొట్టారు. మెహ్రీన్ హీరోయిన్ గా నటించనుంది.

స్టుడియోగ్రీన్ బ్యానర్ పై తెలుగు-తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకుడు. గతంలో విక్రమ్ హీరోగా ఇంకొక్కడు అనే సినిమా తీశాడు ఈ దర్శకుడు. జ్ఞానవేల్ రాజా ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. కోలీవుడ్ లో విజయ్ దేవరకొండకు ఇదే ఫస్ట్ మూవీ కాగా.. హీరోయిన్ మెహ్రీన్ కు ఇది రెండో తమిళ సినిమా కానుంది.

ఈ ప్రాజెక్టుకు శ్యామ్ సీఎస్ సంగీతం అందించబోతున్నాడు. నాగశౌర్య-సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన కణం సినిమాకు ఇతడే సంగీతం అందించాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.