వంద కోట్లు కలెక్ట్ చేసిన రంగస్థలం

Tuesday,April 03,2018 - 12:16 by Z_CLU

సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న రంగస్థలం సినిమా మరో అరుదైన రికార్డు అందుకుంది. వరల్డ్ వైడ్ ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి, సరికొత్త రికార్డు సృష్టించింది. బాహుబలి తర్వాత అతి తక్కువ రోజుల్లో వంద కోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది రంగస్థలం.

అటు ఓవర్సీస్ లో ఇప్పటికే 2 మిలియన్ డాలర్ క్లబ్ ను క్రాస్ చేసిన ఈ సినిమా.. 3 మిలియన్ క్లబ్ లోకి ఎంటరయ్యేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు 2.50 మిలియన్ డాలర్లు. అంటే మరో 50వేల డాలర్లు కలెక్ట్ చేస్తే, 3 మిలియన్ డాలర్ క్లబ్ లోకి వెళ్లిపోతుంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. విడుదలైన ఈ 4 రోజుల్లో రంగస్థలం సినిమా 40 కోట్ల షేర్ టచ్ చేసింది. చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అందుకుంది. ఈ వీకెండ్ నాటికి సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుందని అంచనా. ఏపీ, నైజాంలో రంగస్థలం 4 రోజుల షేర్ ఇలా ఉంది.

నైజాం – రూ. 12.16 కోట్లు
సీడెడ్ – రూ. 8.60 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 6.09 కోట్లు
ఈస్ట్ – రూ. 4.06 కోట్లు
వెస్ట్ – రూ. 3.12 కోట్లు
గుంటూరు – రూ. 5.15 కోట్లు
కృష్ణా – రూ. 3.37 కోట్లు
నెల్లూరు – రూ. 1.62 కోట్లు