బాక్సాఫీస్ ను రఫ్ఫాడిస్తున్న రామ్ చరణ్

Wednesday,April 04,2018 - 01:05 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టామినా ఏంటో మరోసారి తెలిసొచ్చింది. రంగస్థలం సినిమాతో ఈ మెగా హీరో బాక్సాఫీస్ ను రఫ్ఫాడిస్తున్నాడు. ప్రవంచవ్యాప్త వసూళ్లలో ఇప్పటికే 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన రంగస్థలం సినిమా.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల షేర్ వసూలు చేసి మరో రికార్డు సృష్టించింది. ఇక్కడ చెప్పుకోదగ్గ మేటర్ ఏంటంటే.. జస్ట్ 5 రోజుల్లో రంగస్థలం సినిమాకు 50 కోట్ల షేర్ (గ్రాస్ కాదు) వచ్చింది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా 3 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరేందుకు సిద్ధంగా ఉంది.

ఏపీ, నైజాం 5 రోజుల షేర్

నైజాం – రూ. 14.50 కోట్లు
సీడెడ్ – రూ. 9.70 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 6.79 కోట్లు
ఈస్ట్ – రూ. 4.56 కోట్లు
వెస్ట్ – రూ. 3.45 కోట్లు
గుంటూరు – రూ. 5.52 కోట్లు
కృష్ణా – రూ. 4.02 కోట్లు
నెల్లూరు – రూ. 1.80 కోట్లు

5 రోజుల మొత్తం షేర్ – రూ. 50.34 కోట్లు