రంగస్థలం 2 వారాల వసూళ్లు

Friday,April 13,2018 - 03:01 by Z_CLU

నిన్నటితో 2 వారాలు కంప్లీట్ చేసుకుని, సక్సెస్ ఫుల్ గా మూడోవారంలోకి ఎంటరైంది రంగస్థలం సినిమా. ఈ 2 వారాల రన్ లో ఎన్నో రికార్డుల్ని తన ఖాతాలో వేసుకుంది. మరీ ముఖ్యంగా వరల్డ్ వైడ్ వంద కోట్ల షేర్ సాధించిన సినిమాగా అవతరించింది. అటు ఓవర్సీస్ లో కూడా 3 మిలియన్ డాలర్ క్లబ్ లోకి వెళ్లింది. వంద కోట్ల షేర్ క్లబ్ లో మొన్నటివరకు 3 సినిమాలు మాత్రమే ఉన్నాయి. బాహుబలి-1, బాహుబలి-2, ఖైదీ నంబర్ 150 మాత్రమే ఉండగా.. ఇప్పుడు నాలుగో సినిమాగా రంగస్థలం చేరింది.

ఏపీ, నైజాం 14 రోజుల వసూళ్లు

నైజాం – రూ. 21.67 కోట్లు
సీడెడ్ – రూ. 14.10 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 10.50 కోట్లు
ఈస్ట్ – రూ. 6.32 కోట్లు
వెస్ట్ – రూ. 5 కోట్లు
గుంటూరు – రూ. 7.10 కోట్లు
కృష్ణా – రూ. 5.79 కోట్లు
నెల్లూరు – రూ. 2.68 కోట్లు