బన్నీ నుంచి మరో బ్రాండ్ న్యూ పోస్టర్

Tuesday,April 03,2018 - 02:45 by Z_CLU

వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య అనే సినిమా చేస్తున్నాడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తయింది. ఓ వైపు ఆడియో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు బన్నీ బర్త్ డే (ఏప్రిల్ 8) కూడా దగ్గర పడుతోంది. సోషల్ మీడియాలో ఈ మేటర్ వారం రోజుల నుంచే ట్రెండింగ్ అవుతోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా పేరు సూర్య సినిమా నుంచి మరో బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు.

సినిమా స్టోరీలైన్ కు తగ్గట్టే ఈసారి కూడా బన్నీ యాక్షన్ లుక్ తోనే రిలీజైంది ఈ పోస్టర్. ఎలాంటి డీవియేషన్స్ లేకుండా.. సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చే విధంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ టీజర్, ఫస్ట్ సాంగ్ తో ఇదొక కంప్లీట్ యాక్షన్ మూవీ అనే విషయాన్ని చెప్పిన మేకర్స్.. తాజా పోస్టర్ తో కూడా ఆ విషయాన్ని మరోసారి బలంగా చెప్పారు.

ఇక ఈ సినిమా ఆడియో రిలీజ్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. మూవీకి సంబంధించి ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజయ్యాయి. వీటితో పాటు మిగతా పాటలన్నింటితో ఆడియోను విడుదల చేయబోతున్నారు. విశాల్-శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.