మేఘా ఆకాష్ ఇంటర్వ్యూ

Tuesday,April 03,2018 - 10:03 by Z_CLU

నితిన్ 25 వ మూవీ ‘ఛల్ మోహన రంగ’ సినిమాలో హీరోయిన్ గా నటించే లక్కీ చాన్స్ కొట్టేసింది మేఘా ఆకాష్. దానికి తోడు తన పేరుతో సినిమాలో సాంగ్ కూడా ఉండటం, అది సూపర్ సక్సెస్ అవ్వడంతో, సినిమా కూడా అదే రేంజ్ లో సక్సెస్ అవుతుందని జోష్ ఫుల్ గా ఉంది మేఘా ఆకాష్.  ఈ సందర్భంగా ‘జీ సినిమాలు’ తో ఎక్స్ క్లూజివ్ గా చిట్ చాట్ చేసింది. అవి మీకోసం…

 

నా పేరుతో సాంగ్…

చాలా స్పెషల్ గా అనిపించింది. ఎలాగైతేనేం నా పేరు ఎలా పలకాలో చాలా మంది నేర్చుకున్నారు. ఆ సాంగ్ నాకు ఈ ఆల్బమ్ లో మోస్ట్ ఫేవరేట్…

పెద్దగా తేడా లేదు…

మేఘా ఆకాష్ కి మేఘా సుబ్రహ్మణ్యం కి పెద్ద తేడా లేదు. నేను కూడా రియల్ లైఫ్ లో నా క్లోజ్ పీపుల్ తో చాలా జోవియల్ గా ఉంటాను. ఈ సినిమాలో మేఘా కూడా అంతే…

సేమ్ ఫ్యామిలీ…

‘లై’ సినిమా చేసినప్పుడు నితిన్ కి, నాకు పెద్దగా పరిచయం లేదు. కానీ ఈ సినిమా వరకు వచ్చేసరికి చాలా క్లోజ్ అయిపోయాం. నితిన్ తో పాటు టీమ్, సేమ్ ఫ్యామిలీ అనిపించింది.

డైరెక్టర్ కృష్ణ చైతన్య…

చైతు పెద్దగా మాట్లాడరు కానీ సెట్స్ లో ఆయనకు ఏం కావాలో బాగా తెలుసు… ఆయన చాలా స్వీట్… చాలా బాగా న్యారేట్ చేస్తారు…

ప్రెజర్ ఏం లేదు…

డెఫ్ఫినేట్ గా స్పెషల్ ఫిల్మ్. నితిన్ 25 వ మూవీ, పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు… కానీ నేనెక్కడా ప్రెజర్ ఫీల్ అవలేదు. ఈజీ గోయింగ్ అనిపించింది…

అదే నచ్చింది…

సినిమాలో మేఘ నచ్చేసింది. స్టోరీ మ్యాగ్జిమం తన చుట్టే తిరుగుతూ ఉంటుంది.

ఆ మూడింటి చుట్టూ…

పోస్టర్స్ లో చూపించినట్టు సినిమా వైన్ బాటిల్, కుక్క, బుక్ చుట్టూ తిరుగుతుంది. ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అవి సినిమాలో…

ఫన్నీ ఎక్స్ పీరియన్స్…

U.S. లో మయామి లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒకసారి పడిపోయా. నాకు తెలీక స్టేజ్ ఎడ్జ్ కి వచ్చేశాను. అది నాకు ఫన్నీ ఎక్స్ పీరియన్స్…

సినిమాటోగ్రాఫర్ నట్టు గారు…

నట్టు గారు తమిళ సినిమాల్లో కూడా నటించారు. ఆయన గురించి నేను చాలా విన్నాను. సినిమా సెట్స్ లో చాలా ఎనర్జిటిక్ గా ఉండేవారు.

కృష్ణ చైతన్య గారు…

డైరెక్టర్ గారు సినిమా బిగినింగ్ లోనే స్టోరీ ఎక్స్ ప్లేన్ చేశారు కాబట్టి, అస్తమానం న్యారేట్ చేయాల్సిన అవసరం రాలేదు. కాకపోతే డైలాగ్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు, కూర్చుని ప్రాక్టీస్ చేయించేవాళ్ళు, ఆ తరవాతే షూట్ చేసేవాళ్ళు…

అందుకే చూడాలి…

సూపర్ ఫన్ ఫిల్మ్ ఛల్ మోహన రంగ. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. సినిమా చూశాక మంచి ఫీల్ తో బయటికి వస్తారు.

క్రేజీ అనిపించింది…

కాంబినేషన్ విన్నప్పుడే అమేజింగ్ అనిపించింది. పవన్ కళ్యాన్ గారు, త్రివిక్రమ్ గారు, సుధాకర్ రెడ్డి గారు వాళ్లకు తోడు నా పేరుతో సాంగ్ అనగానే క్రేజీ ఫీలింగ్… చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా…