రంగస్థలం మూవీ 3 రోజుల కలెక్షన్

Monday,April 02,2018 - 11:06 by Z_CLU

రంగస్థలం అదరగొడుతోంది. రామ్ చరణ్ కెరీర్ లోనే బెస్ట్ నంబర్స్ రికార్డు చేస్తోంది. చూస్తుంటే.. నాన్-బాహుబలి క్రియేట్ చేసేలా ఉంది. మొదటి రోజు నుంచి కంప్లీట్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ మూవీ, ఫస్ట్ వీకెండ్ నాటికి దిమ్మతిరిగే కలెక్షన్లు సాధించింది. ఓవర్సీల్ లో 3 మిలియన్ డాలర్ క్లబ్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఇప్పటికే మొదలవ్వగా.. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీకెండ్ లో ఏకంగా 38 కోట్ల రూపాయల షేర్ సాధించి, ట్రేడ్ ను సర్ ప్రైజ్ చేస్తోంది.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్

నైజాం – రూ. 10.42 కోట్లు
సీడెడ్ – రూ. 7.60 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 5.18 కోట్లు
గుంటూరు – రూ. 4.64 కోట్లు
ఈస్ట్ – రూ. 3.50 కోట్లు
వెస్ట్ – రూ. 2.72 కోట్లు
కృష్ణా – రూ 3 కోట్లు
నెల్లూరు – రూ. 1.41 కోట్లు