కృష్ణార్జున యుద్ధం ట్రయిలర్ రివ్యూ

Monday,April 02,2018 - 01:07 by Z_CLU

నాని మరోసారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా కృష్ణార్జున యుద్ధం. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రయిలర్ విడుదల చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన కృష్ణార్జున యుద్ధం ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం

టీజర్ లో మెయింటైన్ చేసిన సస్పెన్స్ నే ట్రయిలర్ లో కూడా కొనసాగించారు. స్టోరీలైన్ ఏంటనే విషయాన్ని ఒక్క ఫ్రేమ్ లో కూడా బయటపెట్టలేదు. హీరోలిద్దరూ హీరోయిన్లతో ప్రేమలో పడినట్టు మాత్రమే చూపించారు. ప్రేమ కోసం ఎంతదూరమైన వస్తానని డైలాగ్ ను మాత్రం నానితో చెప్పించారు. వీటికి అదనంగా ట్రయిలర్ లో ఎట్రాక్ట్ చేసిన అంశం ఒకటుంది. అదే యాక్షన్ ఎపిసోడ్స్. నాని సినిమాల్లో ఇప్పటివరకు కనిపించని హై-డోస్ యాక్షన్ కృష్ణార్జున యుద్ధంలో కనిపిస్తోంది.

ఓవరాల్ గా నాని నేచురల్ పెర్ఫార్మెన్స్, అనుపమ-రుక్సార్ లుక్స్, మేర్లపాక గాంధీ టేకింగ్, హిపాప్ తమీజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సన్నివేశాలు ట్రయిలర్ లో హైలెట్స్ గా నిలిచాయి. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను నిర్మాత దిల్ రాజు హోల్ సేల్ గా దక్కించుకున్నారు. ఈనెల 12న థియేటర్లలోకి రానుంది కృష్ణార్జున యుద్ధం సినిమా.