రంగస్థలం 9 రోజుల వసూళ్లు

Sunday,April 08,2018 - 01:07 by Z_CLU

విడుదలైన 8 రోజులకే తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల రూపాయల షేర్ సాధించిన రంగస్థలం సినిమా.. 9వ రోజు కూడా అదే ఊపు కొనసాగింది. వీకెండ్ కావడంతో నిన్న కూడా ఈ మూవీకి ఏపీ, నైజాంలో మంచి వసూళ్లు వచ్చాయి. అలా తెలుగు రాష్ట్రాల్లో తన షేర్ ను 63 కోట్ల రూపాయలకు పెంచుకుంది రంగస్థలం సినిమా. అటు చెన్నై సిటీలో ఈ సినిమా కోటి రూపాయల గ్రాస్ సాధించి, బాహుబలి-2 సినిమా తర్వాత రెండో మూవీగా నిలిచింది.

ఏపీ, నైజాం 9 రోజుల షేర్

నైజాం – రూ. 18.42 కోట్లు
సీడెడ్ – రూ. 12.35 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 8.90 కోట్లు
ఈస్ట్ – రూ. 5.58 కోట్లు
వెస్ట్ – రూ. 4.34 కోట్లు
గుంటూరు – రూ. 6.41 కోట్లు
కృష్ణా – రూ. 5.07 కోట్లు
నెల్లూరు – రూ. 2.29 కోట్లు