జీ సినిమాలు ( 2nd ఏప్రిల్ )

Sunday,April 01,2018 - 10:03 by Z_CLU

కంత్రి

నటీనటులు : NTR, హన్సిక మోత్వాని, తానీషా ముఖర్జీ

ఇతర నటీనటులు : ఆశిష్ విద్యార్థి, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, రఘు బాబు, ముకేష్ రిషి, ఆలీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : మెహర్ రమేష్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 9 మే 2008

NTR, హన్సిక మోత్వాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ కంత్రి. స్టైలిష్ ఎంటర్ టైనర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని అశ్విని దత్ నిర్మించారు.  పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో క్లైమాక్స్ కి కాస్త ముందుగా వచ్చే ట్విస్ట్ హైలెట్.

==============================================================================

చందమామ

నటీనటులు : నవదీప్, కాజల్ అగర్వాల్, శివ బాలాజీ, సింధు మీనన్

ఇతర నటీనటులు : నాగబాబు, ఉత్తేజ్, ఆహుతి ప్రసాద్, జీవా, అభినయ శ్రీ

మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : C. కళ్యాణ్, S. విజయానంద్

రిలీజ్ డేట్ : 6 సెప్టెంబర్ 2007

కలర్ ఫుల్ డైరెక్టర్ కృష్ణవంశీ నటించిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చందమామ. నవదీప్, శివ బాలాజీలు హీరోలుగా నటించిన ఈ సినిమాలో కాజల్, సింధు మీనన్ హీరోయిన్లుగా నటించారు. సినిమాలో భాగంగా అలరించే కామెడీ హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

యోగి

నటీనటులు : ప్రభాస్, నాయన తార

ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, ప్రదీప్ రావత్, సుబ్బరాజు, ఆలీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల

డైరెక్టర్ : V.V. వినాయక్

ప్రొడ్యూసర్ : రవీంద్ర నాథ్ రెడ్డి

రిలీజ్ డేట్ : 12 జనవరి 2017

ప్రభాస్ హీరోగా V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన హై ఎండ్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ యోగి. నయనతార హీరోయిన్ గా నటించిన సినిమాలో ఊర్వశి శారద ప్రభాస్ కి తల్లిగా నటించారు. ఇద్దరి మధ్యన నడిచే ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

=============================================================================

గణేష్

హీరో హీరోయిన్లురామ్,కాజల్

ఇతర నటీనటులుపూనమ్ కౌర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం

సంగీతం      – మిక్కీ జె మేయర్

దర్శకత్వం  –  శరవణన్

విడుదల తేదీ – 2009

రామ్ కాజల్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘గణేష్ జస్ట్ గణేష్’. 2009 లో విడుదలైన ఈ సినిమా యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్. చిన్న పిల్లలతో గణేష్ చేసే హంగామా , కాజల్-రామ్ మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగా అలరిస్తాయి. అబ్బూరి రవి అందించిన మాటలు సినిమాకు ప్లస్, ముఖ్యంగా క్లైమాక్స్ లో మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. కాజల్ కుటుంబ సభ్యుల మధ్య మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అందరినీ హత్తుకుంటాయి.

=============================================================================

రాక్షసుడు

నటీనటులు : సూర్య, నయనతార

ఇతర నటీనటులు : ప్రేమ్గీ అమరేన్, ప్రణీత సుభాష్, ప్రతిభాన్, రియాజ్ ఖాన్, సముథిరఖని, శరత్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : వెంకట్ ప్రభు

ప్రొడ్యూసర్ : K.E. జ్ఞానవేల్ రాజా

రిలీజ్ డేట్ : 29  మే 2015

సూర్య కరియర్ లోనే డిఫెరెంట్ సినిమాగా నిలిచింది రాక్షసుడు. సూర్య డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా అటు తమిళం లోను, తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయింది. ఆత్మగా నటించిన సూర్య పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

==============================================================================

శంకరాభరణం

నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ, నందితా రాజ్, అంజలి

ఇతర నటీనటులు : సంపత్ రాజ్, సుమన్, సితార, రావు రమేష్, సప్తగిరి, పృథ్వీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ప్రవీణ్ లక్కరాజు

డైరెక్టర్ : ఉదయ్ నందనవనం

ప్రొడ్యూసర్ : M.V.V. సత్య నారాయణ

రిలీజ్ డేట్ : 4 డిసెంబర్ 2015

నిఖిల్ హీరోగా నటించిన సూపర్ హిట్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ శంకరాభరణం. తమకు దక్కాల్సిన ప్యాలెస్ ని అక్రమంగా స్వాధీనం చేసుకున్న తన కుటుంబసభ్యుల కోసం ఇండియాకు వచ్చిన గౌతమ్ ఇండియాలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడు..? అనేదే సినిమాలో ప్రధాన కథాంశం. అంజలి స్పెషల్ క్యారెక్టర్ లో నటించిన సినిమాలో కామెడీ హైలెట్ గా నిలిచింది.