ఫస్ట్ లుక్ తో రెడీ అయిన రామ్ చరణ్

Monday,November 05,2018 - 03:35 by Z_CLU

మెగాఫ్యాన్స్ మాత్రమే కాదు, టోటల్ టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ కోసం. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి దర్శకత్వంలో చరణ్ చేస్తున్న సినిమా అప్ డేట్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. కానీ ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ విషయంలో మాత్రం ఎడతెగని సస్పెన్స్ నడుస్తోంది. మరికొన్ని గంటల్లో ఆ సస్పెన్స్ క్లియర్ అయిపోతుంది. అవును.. రేపు మధ్యాహ్నం 1 గంటకు రామ్ చరణ్, బోయపాటి సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు.

కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే కాదు, టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ఒకేసారి ఎనౌన్స్ చేశారు. నవంబర్ 9న ఉదయం 10 గంటల 25 నిమిషాలకు రామ్ చరణ్ కొత్త సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు వినయ విధేయ రామ అనే టైటిల్ పెడతారంటూ కొన్ని రోజులుగా ప్రచారం నడుస్తోంది. ఆ టైటిల్ పై రేపు క్లారిటీ రాబోతోంది.

చరణ్-బోయపాటి కాంబోలో ఫస్ట్ మూవీ ఇది. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తారు. టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.