పెళ్లికి సిద్ధమైన నోటా దర్శకుడు

Monday,November 05,2018 - 03:26 by Z_CLU

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన నోటా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు దర్శకుడు ఆనంద్ శంకర్. ఇప్పుడీ దర్శకుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసిని త్వరలోనే పెళ్లాడబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు ఆనంద్ శంకర్.

దుబాయ్ లో తన గర్ల్ ఫ్రెండ్ తో ఎంగేజ్ మెంట్ పూర్తయినట్టు ప్రకటించాడు ఈ దర్శకుడు. ఎంగేజ్ మెంట్ రింగ్ తో పాటు కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మురుగదాస్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన ఆనంద్ శంకర్, అరిమ నంబి సినిమాతో దర్శకుడిగా మారాడు. తర్వాత విక్రమ్ హీరోగా ఇంకొక్కడు అనే సినిమా చేశాడు. నోటా మూవీ అతడికి మూడో సినిమా.