Natu Natu - ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్

Monday,March 13,2023 - 05:28 by Z_CLU

రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ చరిత్ర సృష్టించింది. ఈ చిత్రంలోని “నాటు నాటు” Naatu Naatu పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరీలో 95వ అకాడమీ అవార్డ్స్‌ గా ఆస్కార్స్ లభించాయి. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్‌లకు అవార్డ్స్ దక్కాయి.

గతంలో AR రెహమాన్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (“జై హో”) క్ గానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఆస్కార్‌లను గెలుచుకున్నారు, కానీ అది భారతీయ చిత్రానికి కాదు. బ్రిటీష్ చిత్రం “స్లమ్‌డగ్ మిలియనీర్” సినిమాకు వర్క్ చేసినందుకు అవార్డును అందుకున్నాడు. “నాటు నాటు” ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న మొదటి భారతీయ సినిమా పాటగా నిలిచింది.

ఇక ఆస్కార్ అవార్డ్స్ వేదికపై రాహుల్ సిప్లిగంజ్ , కాల భైరవ సహా చాలా మంది తో కలిసి నాటు నాటు సాంగ్ ను పెర్ఫార్మ్ చేయడం హైలైట్ గా నిలిచింది. “నాటు నాటు” పాటను ఎమ్ఎమ్ కీరవాణి స్వరపరచగా, చంద్రబోస్ లిరిక్స్ రాశారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన RRR సరికొత్త చరిత్ర సృష్టించి తెలుగు వారిని అలాగే ఇండియన్ సినిమా గర్వపడేలా చేసింది.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics