'టాక్సీవాలా' జ్యూక్ బాక్స్ రివ్యూ

Monday,November 05,2018 - 03:45 by Z_CLU

విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ జ్యూక్ బాక్స్ రిలీజయింది.  రీసెంట్ గా రిలీజైన ‘మాటే వినదుగ’ సాంగ్, తక్కిన పాటలపై కూడా అదే రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ని సెట్ చేసింది. సందర్భానుసారంగా ఉండబోయే 4 పాటలతో ఉన్న ఈ జ్యూక్ బాక్స్, సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది.

లేడీస్ అండ్ జెంటిల్మెన్ : హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేసే సాంగ్. లిరిక్స్ ని బట్టి హీరోకి జాబ్ దొరికిన సందర్భంలో ఈ పాట  ఉంటుందని  తెలుస్తుంది. హేమచంద్ర, జేక్స్ బిజాయ్ ఈ కలిసి ఈ పాట పాడారు. కృష్ణకాంత్ లిరిక్స్ రాశాడు.

మాటే వినదుగ : ‘టాక్సీవాలా’ సినిమా నుండి రిలీజైన ఫస్ట్ సింగిల్ ఇది. ‘మాటే వినదుగ’ అంటూ సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ఇన్స్ టంట్ గా హిట్టయ్యింది. ఇప్పటికే యూత్ ఫేవరేట్ సాంగ్ అనిపించుకుంటున్న ఈ పాట విజువల్స్ పై కూడా భారీ అంచనాలున్నాయి. కృష్ణకాంత్ ఈ పాటకి లిరిక్స్ రాశాడు.

క్రేజీ కార్ : సినిమాలో సందర్భానుసారంగా ఉండే సాంగ్. కార్ చుట్టూ తిరిగే సాంగ్ ఇది. సినిమాలో హీరో పడే ఇబ్బందులు  ఎగ్జాక్ట్ గా గెస్  చేయడం  కష్టమే కానీ, ఆ కారు వల్లే  ఇన్ని  ప్రాబ్లమ్స్ అని హీరో రియలైజ్ అయ్యే సిచ్యువేషన్ లో ఉండే సాంగ్ అని తెలుస్తుంది. రేవంత్ కుమార్ పాడిన ఈ పాటని కృష్ణకాంత్ రాశాడు.

నీవే నీవే : ఈ సినిమా జ్యూక్ బాక్స్ లో ‘మాటే వినదుగ’ తరవాత మళ్ళీ అదే తరహా మెలోడియస్ సాంగ్. ఈ పాటని శ్రియ ఘోషల్ పాడటంతో జేక్స్ బిజాయ్ ట్యూన్స్ కి మరింత గ్రేస్ ఆడ్ అయింది. ఈ సాంగ్ లిరిక్స్ ని కూడా కృష్ణకాంత్ రాశాడు.

ఓవరాల్ గా జేక్స్ బిజాయ్ కంపోజ్ చేసిన సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాయి. నవంబర్ 17 న రిలీజ్ కానున్న ‘టాక్సీవాలా’ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేస్తుందీ జ్యూక్ బాక్స్.