ZEE5 RRR - మరికొన్ని గంటల్లో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్

Thursday,May 19,2022 - 03:10 by Z_CLU

“ZEE5” తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా అందిస్తోంది. “ZEE5”  ప్రారంచిన నాటినుండి వినోదంలో వీక్షకులను ఆకట్టుకుంటూ ఓటిటి లలోనే ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా దేశవ్యాప్తంగా “ZEE5” మంచి పేరు తెచ్చుకుంది. అటువంటి పాపులర్ ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు “RRR” ‘రౌద్రం రణమ్ రుధిరం’ని అన్ని భారతీయ భాషలలో తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మరో మాటలో చెప్పాలంటే, భారతదేశపు అతిపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఈ సంవత్సరంలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌ “RRR” ద్వారా “ZEE5” అత్యుత్తమ వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది.

‘RRR’ (‘రౌద్రం రణం రుధిరం’) స్ట్రీమింగ్ ప్రారంభం కావడానికి మే 20 గొప్ప రోజు కానుంది. రాజమౌళి సినిమా పే పర్ వ్యూ విధానంలో అందుబాటులో ఉంటుందని ఇంతకుముందు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే..కానీ ఆ నిర్ణయాన్ని ప్రేక్షకులు స్వాగతించడం లేదు.

అయితే “ZEE5” టీం సాధారణ ప్రజల అభిప్రాయాలను  పరిగణనలోకి తీసుకుని, “ZEE5” T-VOD మోడ్‌ను తొలగించాలని నిర్ణయించింది మరియు సాధారణ చందా ఉన్న చందాదారులందరికీ ‘RRR’ ను ఫ్రీ గా చూసే అవకాశం కల్పించాలని నిర్ణయించింది.

ఇప్పటికే ఉన్న “ZEE5” సబ్‌స్క్రైబర్‌ లు ‘RRR’ని ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తూ నెటిజన్లు చేసిన అభ్యర్థనలను “ZEE5” టీం పరిగణనలోకి తీసుకుంది. కాబట్టి, స్ట్రీమింగ్ దిగ్గజం “ZEE5” వారు మే 20 నుండి ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రైబర్‌లు/పెయిడ్ యూజర్‌లకు ‘RRR’ని ఉచితంగా అందించనుంది.

‘RRR’ S-VODలో ఈరోజు అర్థరాత్రి నుంచి “ZEE5” వీక్షకులకు అందుబాటులో ఉంటుంది. రూ. 699 (RRR ప్లస్ “ZEE5” యొక్క వార్షిక చందా) చెల్లించి కాంబో ప్యాక్‌ని కొనుగోలు చేసిన వినియోగదారులందరికీ చేంజ్ చేసిన ప్లాన్ ప్రకారం మూడు నెలలు అదనపు కాలపరిమితి చెల్లుబాటు అయ్యేవిధంగా అందించడం జరుగుతుంది. .

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన దృశ్య కావ్యం ‘ఆర్ఆర్ఆర్’. మే 20వ తేదీన ‘ZEE5’ ఓటీటీ వేదికలో తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో సినిమాను వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ థియేటర్లలో విడుదలై 50 రోజులు దాటింది. మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులకు ప్రత్యేకమైన రోజు! అందుకే ZEE5 ఆయన అభిమానులకు కానుకగా డిజిటల్ తెరపైకి “RRR” ప్రీమియర్‌ ను ప్రత్యేక బహుమతిగా వీక్షకులకు అందిస్తున్నారు. వీక్షకులు ఈ ల్యాండ్‌మార్క్ ఫిల్మ్‌ను అత్యుత్తమ 4K నాణ్యతలో, డాల్బీ అట్మాస్‌ సౌండ్ తో వారి ఇళ్లలో సౌకర్యవంతంగా చూడవచ్చు.

‘RRR’ని మీ ఇంటికి తీసుకురావడం ద్వారా, ZEE5 మరోసారి వీక్షకులకు అత్యుత్తమ వినోదం అందించడానికి “ZEE5″‘ కృషి చేస్తుందని మరోసారి రుజువైంది. ఇప్పుడు “ZEE5” పేరు ప్రతి ఇంట  వినబడుతోందనడంలో ఆశ్చర్యం లేదు. కేవలం దక్షిణ భారత వీక్షకులే కాదు, దక్షిణాది భాషల్లో ఏదీ తెలియని OTT వినియోగదారులు కూడా ‘RRR’ని ఆంగ్ల ఉపశీర్షికలతో వీక్షించే అవకాశం ఉన్నందున ఈ వార్తలను చూసి సంతోషిస్తున్నారు.

ZEE5 ఇటీవలే ‘RRR’ ఓటీటీ ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ అద్భుతంగా ఉంది, ప్రేక్షకులు ‘RRR’ని మళ్లీ మళ్లీ చూడాలను కుంటున్నారు! మరెందుకు ఆలస్యం వెంటనే ZEE5 ను సబ్ స్క్రైబ్ చేసుకుంటే వీక్షకులకు కావాల్సినంత వినోదం ఇవ్వడం కోసం ‘ZEE5’ రెడీ అయింది.