RRR Movie entered into 1000 Crore club worldwide
రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన RRR Movie మరో ఘనత సాధించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. అవును.. నిన్నటితో వచ్చిన వసూళ్లను కలుపుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. విడుదలైన 15 రోజుల్లో ఈ ఘనత సాధించింది ఆర్ఆర్ఆర్.
ఇండియన్ హిస్టరీలో ఇదో చరిత్ర. ఈ ఘనత అందుకున్న మూడో చిత్రంగా నిలిచింది ఆర్ఆర్ఆర్ మూవీ. ఇంతకుముందు లిస్ట్ లో దంగల్, బాహుబలి-2 సినిమాలు మాత్రమే ఉన్నాయి.
1. దంగల్ – రూ.2025 కోట్లు గ్రాస్ (చైనాలో వచ్చిన రూ.725 కోట్ల గ్రాస్ కాకుండా)
2. బాహుబలి 2 – రూ. 1810 కోట్లు (చైనాలో వచ్చిన రూ. 1730 కోట్ల గ్రాస్ కాకుండా)
3. ఆర్ఆర్ఆర్ – రూ. 1000 కోట్లు (ఇంకా చైనాలో విడుదల కాలేదు)
ఈ సినిమా ఓవర్సీస్ లో తాజాగా వంద కోట్ల రూపాయల నెట్ సాధించింది. అటు నార్త్ బెల్ట్ లో ఈ సినిమా 220 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇవాళ్టి కలెక్షన్లు కూడా కలుపుకుంటే, ఈ సినిమా కచ్చితంగా 230 కోట్ల రూపాయలు దాటుతుంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఈ సినిమా దాదాపు ప్రతి ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయింది. అన్నింటికంటే ముందుగా నైజాం, నెల్లూరులో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా, ఉగాది ఇచ్చిన ఊపుతో మిగతా అన్ని ఏరియాల్లో లాభాల్లోకి ఎంటరైంది.

- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics