దసరాకు కూడా రాని చరణ్ సినిమా ఫస్ట్ లుక్

Friday,October 19,2018 - 11:31 by Z_CLU

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను దసరా సందర్భంగా విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ దసరాకు చెర్రీ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాలేదు.

నిజానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిరంజీవి పుట్టినరోజు నాడు విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ రాలేదు. ఆ తర్వాత వినాయక చవితికి, ఆ తర్వాత ఫారిన్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కూడా వెయిట్ చేశారు. కానీ ఫస్ట్ లుక్ రాలేదు. ఇప్పుడు దసరా ను కూడా మిస్ అయ్యాడు చరణ్.

ఈ సినిమాకు వినయ విధేయ రామ అనే టైటిల్ అనుకుంటున్నారు. టైటిల్ పై ఇంకా ఓ క్లారిటీకి రాకపోవడం వల్లనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదని తెలుస్తోంది. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఎనౌన్స్ చేస్తారు.