అమెరికా షెడ్యూల్ ప్రారంభించిన మహేష్

Friday,October 19,2018 - 10:37 by Z_CLU

మహర్షి సినిమాకు సంబంధించి మోస్ట్ ఎవెయిటెడ్ యూఎస్ షెడ్యూల్ ప్రారంభమైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి నిన్నట్నుంచి అమెరికాలో షూటింగ్ మొదలుపెట్టారు. మహేష్ పై కొన్ని సీన్స్ తీస్తున్నారు.

నిజానికి ఈ షెడ్యూల్ ను సెప్టెంబర్ లోనే ప్లాన్ చేశారు. కానీ వీసా నిబంధనలు కఠినంగా తయారవ్వడంతో అనుమతి రాలేదు. ఎట్టకేలకు వీసా ప్రాసెస్ తో పాటు సెక్యూరిటీ క్లియరెన్స్ దక్కడంతో మహర్షి యూఎస్ షెడ్యూల్ స్టార్ట్ అయింది.

నిన్నట్నుంచి న్యూయార్క్ లో మొదలైన ఈ షెడ్యూల్ ఏకథాటిగా 20 రోజుల పాటు ఉంటుంది. అంటే వచ్చేనెల మొదటివారం వరకు నాన్-స్టాప్ గా షూటింగ్ చేస్తారన్నమాట. ప్రస్తుతం ఇటలీలో ప్రభాస్ సినిమాలో నటిస్తున్న పూజా హెగ్డే, అట్నుంచి అటే న్యూయార్క్ వచ్చి మహర్షి సెట్స్ లో జాయిన్ అవుతుంది.

20 రోజుల షెడ్యూల్ లో న్యూయార్క్ తో పాటు అమెరికాలోని పలు నగరాల్లో సినిమాకు సంబంధించి షూటింగ్ చేస్తారు. మహేష్ పై ఓ మాంటేజ్ సాంగ్ కూడా ఈ షెడ్యూల్ లోనే ప్లాన్ చేశారు.