ఫస్ట్ లుక్ తో రెడీ....

Friday,August 04,2017 - 11:44 by Z_CLU

‘హైపర్’ తర్వాత  కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కి టైటిల్ ఫిక్స్ అయింది. ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి ఇటీవలే టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ డేట్ అనౌన్స్ చేశాడు రామ్. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన మేకర్స్ ఆగస్టు 5న శనివారం ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నారు.

నేను శైలజ తరవాత రామ్ – కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, మేఘ ఆకాష్ హీరోయిన్స్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై రవి కిశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కంప్లీట్ గా ఓ డిఫరెంట్ లుక్ తో సిక్స్ ప్యాక్ బాడీ తో మెస్మరైజ్ చేయబోతున్నాడు రామ్.