గ్రాండ్ గా రిలీజైన నక్షత్రం

Friday,August 04,2017 - 11:32 by Z_CLU

కృష్ణవంశీ నక్షత్రం ఈ రోజే గ్రాండ్ గా రిలీజయింది. సందీప్ కిషన్ హీరోగా సాయి ధరమ్ తేజ్ స్పెషల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. హీరోయిన్స్ రెజీనా కసాంద్ర, ప్రగ్యా జైస్వాల్ తో పాటు శ్రియ స్పెషల్ సాంగ్ చేయడం ఈ సినిమా పై ఈ రేంజ్ లో ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తుంది.

ఇండియన్ పోలీస్ స్టామినా ఎలివేట్ అయ్యేలా, ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని సర్టిఫికేట్ ఇచ్చేశాయి ట్రేడ్ వర్గాలు. భీమ్స్, భరత్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని S. వేణుగోపాల్, సజ్జు, K. శ్రీనివాసులు నిర్మాతలు.