మాస్ మహారాజ్ సరసన 'ఆర్ ఎక్స్ 100' బ్యూటీ

Tuesday,November 06,2018 - 11:04 by Z_CLU

త్వరలోనే ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ నెక్స్ట్ వి.ఐ.ఆనంద్ తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. డిసెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో రవితేజ సరసన ఇప్పటికే నభా నటేష్ హీరోయిన్ గా కన్ఫర్మ్ కాగా ఇప్పుడు మరో హీరోయిన్ ను కూడా ఫైనలైజ్ చేసుకున్నారు మేకర్స్.

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో యూత్ ని ఎట్రాక్ట్ చేసి ఫాలోయింగ్ పెంచుకున్న పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో ఓ లీడ్ రోల్ లో కనిపించనుందని తెలుస్తుంది. లేటెస్ట్ గా పాయల్ ఈ సినిమాకు సైన్ కూడా చేసిందని సమాచారం.

సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి నిర్మించనున్నారు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజర్.