అమెరికా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న మహర్షి

Tuesday,November 06,2018 - 04:53 by Z_CLU

గత 2 నెలలుగా U.S. లోని న్యూయార్క్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది ‘మహర్షి’ టీమ్. సినిమాలోని  కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో తెరకెక్కించిన ఫిల్మ్ మేకర్స్, రీసెంట్ గా ఈ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పేశారు. ప్రస్తుతం ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ప్రిపరేషన్స్ లో ఉంది మహర్షి టీమ్.

రీసెంట్ గా రిలీజైన టీజర్ తరవాత, కంప్లీట్ కాన్సంట్రేషన్ షూటింగ్ పైనే పెట్టిన ఫిల్మ్ మేకర్స్, త్వరలో సినిమా షూటింగ్ కి ప్యాకప్ చెప్పే ప్రాసెస్ లో ఉన్నారు. అల్లరి నరేష్ ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో బిగిన్ చేయనుంది మహర్షి టీమ్.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. దిల్ రాజు, PVP తో పాటు అశ్వినిదత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి డైరెక్టర్.