‘భరత్ అనే నేను’ మూవీ హైలెట్స్

Wednesday,April 18,2018 - 02:46 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ‘భరత్ అనే నేను’ మూవీ ఫీవర్ కనిపిస్తుంది. ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత మళ్ళీ సెట్స్ పైకి వచ్చిన ఈ సక్సెస్ ఫుల్ కాంబో క్రియేట్ చేస్తున్న వైబ్రేషన్స్ చూస్తుంటే, రికార్డ్ బ్రేకింగ్ సక్సెస్ సాధించడం గ్యారంటీ అనే అనిపిస్తుంది. ఈ సినిమా వైపు ఈ రేంజ్ లో కాన్సంట్రేషన్ మళ్లిస్తున్న మోస్ట్ ఎఫెక్టివ్ ఎలిమెంట్స్ ఇవే…

కథ – స్క్రీన్ ప్లే : అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ సిస్టమ్… పాలిటిక్స్.. ఇదే ‘భరత్ అనే నేను’ మెయిన్ థీమ్. సినిమాలో హైలెట్ కాబోయే ప్రజా సమస్యలు కొత్తవి కాకపోయినా , మహేష్ బాబు రెగ్యులర్ CM లా కాకుండా డిఫెరెంట్ గా ఆ సమస్యల్ని హ్యాండిల్ చేయడమే ‘భరత్ అనే నేను’ సినిమా. ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత వస్తున్న ఈ సినిమాపై కొరటాల మార్క్ హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

మహేష్ బాబు – CM గెటప్ : మహేష్ బాబును CM గా చూడటం… ప్రస్తుతానికి సినిమాలో మోస్ట్ డామినేటింగ్ ఎలిమెంట్. ముఖ్యమంత్రి గా చేసిన ప్రమాణ స్వీకారానికి కట్టుబడి, ప్రజలకు మేలు చేసే ప్రాసెస్ లో, ఒక్కోసారి జనం ఇబ్బంది పడాల్సి వచ్చినా ఏ మాత్రం వెనక్కు తగ్గని ఫోకస్డ్ CM గా మహేష్ బాబు విశ్వరూపం… ఫ్యాన్స్ లో క్యూరాసిటీ జెనెరేట్ చేస్తుంది.

బడ్జెట్ – సెట్స్ : సినిమాలో ఏ రేంజ్ లావిష్ నెస్ ఉందో  ట్రైలర్, సాంగ్ ప్రోమోస్ ని బట్టి తెలిసిపోతుంది. సినిమాలోని జస్ట్ అసెంబ్లీ సెట్ కోసమే 2 కోట్లు ఖర్చు పెట్టిన ఫిల్మ్ మేకర్స్, టెంపుల్ బ్యాక్ గ్రౌండ్ లో ఉండే ‘వచ్చాడయ్యో సామీ’ సాంగ్ కోసం ఏకంగా 4 కోట్లు ఖర్చు పెట్టారు. సినిమాలోని ప్రతి ఎలిమెంట్ ని ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించడం  సినిమా స్టాండర్డ్స్ ని నెక్స్ట్ లెవెల్ లో నిలబెడుతున్నాయి.

మ్యూజిక్ : సినిమాని ఇంతలా ఎట్రాక్ట్ చేస్తున్న ఎలిమెంట్స్ లో దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ మ్యాజిక్ డీఫాల్ట్ ఎలిమెంట్. ఇప్పటికే సాంగ్స్ సూపర్ హిట్టయ్యాయి. సాంగ్స్ తో పాటు కొరటాల విజన్ కి మరింత లైఫ్ ని ఆడ్ చేసే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ కానుంది.

 

ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ : ఈ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతుంది కైరా అద్వానీ. పొలిటికల్ ఎలిమెంట్స్ తో పాటు సినిమాలో మహేష్ బాబు, కైరా అద్వానీ మధ్య ఉండే లవ్ ట్రాక్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్ ప్రోమోస్ ని బట్టి ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మరింత మ్యాజిక్ ని జెనెరేట్ చేయడం ఖాయమనిపిస్తుంది.