‘RRR’ లో పోలీసాఫీసర్ గా రామ్ చరణ్..?

Thursday,February 07,2019 - 03:48 by Z_CLU

‘RRR’ లో రామ్ చరణ్ క్యారెక్టర్ అసలు ఎలా ఉండబోతుంది…? నిన్నా మొన్నటి వరకు ఈ సినిమాలో చెర్రీ బాక్సర్ లా కనిపిస్తాడనే టాక్ ఆల్మోస్ట్ కన్ఫమ్ అన్నట్టుగానే నడిచింది. ఈ హడావిడి చిన్నగా తగ్గిందో లేదో, అంతలోనే ఈ సినిమాలో రామ్ చరణ్ పోలీసాఫీసర్, ఇది ఫిక్స్ అనే న్యూస్ చక్కర్లు కొడుతుంది. దీంతో అసలే ఫోకస్ లో ఉన్న సినిమాపై మరింత బజ్ క్రియేట్ అవుతుంది.

ఇక ఫిల్మ్ మేకర్స్ విషయానికి వస్తే బయట ఈ సినిమాపై ఏ రేంజ్ లో స్పెక్యులేషన్స్ క్రియేట్ అయినా ‘RRR’ టీమ్ కంప్లీట్ కాన్సంట్రేషన్ సినిమా షూటింగ్ పైనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 1000 మంది పాల్గొంటుండగా భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్.

ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరా అన్నది ఇంకా రివీల్ చేయలేదు మేకర్స్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. D.V.V. దానయ్య ప్రొడ్యూసర్. ఈ సినిమా 2020 లో రిలీజవుతుంది. రాజమౌళి ఈ సినిమాకి డైరెక్టర్.